Site icon NTV Telugu

Telangana: ఉద్యోగుల పరస్పర బదిలీల్లో సీనియారిటీ ప్రొటెక్షన్

ఉద్యోగుల పరస్పర బదిలీలకు గాను ఈ నెల 15 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్.. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీనియారిటీ ప్రొటెక్షన్‌ను కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు.. ఈ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే జీవో ఎం.ఎస్. నెంబర్ 21 తేదీ 02.02.2022 విడుదల చేయడం జరిగిందని, ఈ జీవోలో పారా 7, 8 పారాల్లో పేర్కొన్న నిబంధనలను మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో ఆర్.టి నెంబర్ 402 తేదీ ,19.2.2022తో జారీ చేయడం జరిగిందని వెల్లడించారు.. తద్వారా, ఉమ్మడి జిల్లా కేడర్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్టయితే, వారి సీనియారిటీ కొత్త లోకల్ కేడర్‌లో కూడా రక్షణ ఉంటుందని వివరించారు.. ఈ బదిలీలకై దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులు IFMIS. పోర్టల్ ద్వారా 15 తేదీలోగా సమర్పించాలని తెలిపిన ఆయన.. ఇప్పటి వరకు పరస్పర బదిలీలకై 31 దరఖాస్తులు అందాయని వెల్లడించారు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌.

Read Also: Realtors Murder Case: స్కెచ్‌ వేసింది ఆయనే.. ఇలా జరిగింది-సీపీ

Exit mobile version