NTV Telugu Site icon

Dharmapuri Srinivas Health: మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ కు అస్వస్థత..

Dharmapuri Srinivas Health

Dharmapuri Srinivas Health

Dharmapuri Srinivas Health: నిజామాబాద్ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ కు అస్వస్థతకు గురయ్యారు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. యూరినరీ ఇన్ఫెక్షన్ తో హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐ.సి.యూలో డి.ఎస్. చికిత్స పొందుతున్నారు. తండ్రి అనారోగ్యం విషయాన్ని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మా నాన్న డి. శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.

Read also: Tragedy: చెట్టు కింద సేద తీరుతున్న వారిపై దూసుకెళ్లిన వాహనం, నలుగురు మృతి

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సోడియం నష్టం కారణంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఐసియులో చేరారని ట్విటర్ వేదికగా తెలిపారు. మా నాన్న ఆరోగ్యంగా ఉండాలని అందరూ ప్రార్థించాలని కోరారు. ప్రస్తుతం డి. శ్రీనివాస్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కాగా.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన డీ శ్రీనివాస్.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే.. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక రాజకీయాల్లో కూడా ప్రస్తుతం ఆయన క్రియాశీలంగా లేరనే చెప్పాలి. కాగా.. ఇందుకు ఆరోగ్య సమస్యలే కారణంగా తెలుస్తోంది.

Prasanna Vadanam : అరుదైన ఘనత సాధించిన సుహాస్ ప్రసన్న వదనం..

Show comments