NTV Telugu Site icon

Amith Shah: బేగంపేట్ ఎయిర్ పోర్టు వద్ద భద్రత… ఎస్ పీజీ కమండోస్ తో అమిత్ షా కాన్వాయ్

Amith Shah Begumpet Airport

Amith Shah Begumpet Airport

Amith Shah: మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు బేగంపేట్ ఎయిర్ పోర్టు వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్ట్ లో డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఎస్ పీజీ కమండోస్ తో అమిత్ షా కాన్వాయ్ భద్రత ఏర్పాటు చేపట్టారు. అమిత్ షా రూట్ మ్యాప్ తో పోలీసులు కాన్వాయ్ సిద్దం చేశారు. ఎయిర్ పోర్టులో అమిత్ షా కు బీజేపీ నేతలు బండి సంజయ్, డి. కే. అరుణ, కేంద్ర టురిజ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి బేగం పెట్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు.

Read also: Ananthkumar Hedge: రాజ్యాంగంపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. రెండో జాబితా నుంచి పేరు ఔట్!

అనంతరం మధ్యాహ్నం 3:15 నుంచి 4:25 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, మండల, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉన్నందున ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, ఇతర నాయకులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అనంతరం రాష్ట్ర నేతలతో షా భేటీ కానున్నారు. సదస్సు అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో సాయంత్రం 4:45 నుంచి 5:45 గంటల వరకు పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం, నేతల మధ్య సమన్వయం మెరుగ్గా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు.
Seema Haider: సీఏఏ అమలుపై సీమా హైదర్ రియాక్షన్.. ప్రధానిపై ప్రశంసలు