NTV Telugu Site icon

Traffic Alert: ట్రాఫిక్ అలర్ట్.. నేటి నుంచి ఈ నెల 10 వరకు ఆంక్షలు

Trafic Alert

Trafic Alert

Traffic Alert: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నేటినుంచి ఈ నెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ పేట్ ఓల్డ్ PS, ప్యారడైజ్, CTO, ప్లాజా, SBI క్రాస్ రోడ్, YMCA, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, పాట్నీ క్రాస్ రోడ్, పార్క్ లైన్, బాటా, ఘస్మండి క్రాస్ రోడ్, రసూర్ పురా రోడ్లు, జంక్షన్ల వైపు వాహనదారులు రావద్దని సూచించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చేవారు ముందుగానే బయలుదేరాలని సూచించారు. టబాకో బజార్, హిట్ స్ట్రీట్ నుండి మహంకాళి ఆలయం వైపు వెళ్లే రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేయబడతాయి. బాట క్రాస్‌ రోడ్డు నుంచి పాత రాంగోపాల్‌ పేట పీఎస్‌, సికింద్రాబాద్‌, సుబాష్‌ రోడ్డు వరకు వాహనాల రాకపోకలు నిలిపివేయున్నారు. అలాగే, కర్బలా మైదాన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను మినిస్టర్ రోడ్-రసూల్‌పురా క్రాస్ రోడ్-PNT ఫ్లైఓవర్-CTO-SBI క్రాస్ రోడ్-YMCA క్రాస్ రోడ్-సెయింట్ జాన్స్ రోటరీ-సంగీత్-గోపాలపురం లేన్‌లో రాణిగంజ్ క్రాస్ వద్ద మళ్లిస్తారు.

Read also: Maharastra : అనర్హత పిటిషన్‌పై సమాధానం ఇవ్వండి.. 54 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసు

రైల్వేస్టేషన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు తిరిగే ఆర్టీసీ బస్సులను చిలకలగూడ ఎక్స్‌ రోడ్డు, గాంధీ ఆస్పత్రి-ముషీరాబాద్‌ ఎక్స్‌ రోడ్డు-కవాడిగూడ-మారియట్‌ హోటల్‌-ట్యాంక్‌బండ్‌ మీదుగా మళ్లిస్తారు. అలాగే రైల్వే స్టేషన్‌ నుంచి తాడ్‌బన్‌, బేగంపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను క్లాక్‌ టవర్‌, ప్యాట్నీ క్రాస్‌ రోడ్‌, ఎస్‌బీఐ క్రాస్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు. బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, త్రిముల్గేరి వైపు వచ్చే వాహనదారులను సజ్జన్ లాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, హిట్ స్ట్రీట్, ఘస్మండి క్రాస్ రోడ్‌లోని రాణిగంజ్ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎస్‌బీఐ క్రాస్‌ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను ప్యారడైజ్‌, మినిస్టర్‌ రోడ్‌, క్లాక్‌ టవర్‌, సంగీత్‌ క్రాస్‌ రోడ్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, చిలకలగూడ, ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్‌, కవాడిగూడ, మ్యారియట్‌ హోటల్‌, ట్యాంక్‌బండ్‌ మీదుగా ప్యాట్నీ క్రాస్‌ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. త్రోవ. ప్రజలు సహకరించి మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
Etala Rajender: ఇప్పటికే ఆలస్యం జరిగింది.. బీఆర్‌ఎస్‌ను దించేది బీజేపీ నే

Show comments