Komaram Bheem: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజుల నుంచి ఏనుగు భీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందగా.. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగు కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న రాత్రి కొండపల్లి రోడ్డు పై గజరాజు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. మొన్న మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా నుంచి ప్రాణహిత నది దాటిన ఏనుగు తెలంగాణ లొకి వచ్చింది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరిని రెండు వేర్వేరు చోట్ల తొక్కి చంపింది. దీంతో అధికారులు ఏనుగుకోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నాలుగేళ్లుగా మంద నుంచి తప్పి ఒంటరిగా సంచరిస్తున్నట్లు గుర్తించారు. కొంత కాలంగా ఒడిశా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో తిరిగిందని, తొలి సారిగా తెలంగాణ లోకి ప్రవేశించి మనషులపై దాడి చేస్తుందని అధికారులు గుర్తించారు. పంట పొలాలు, నీళ్ళు ఉన్న కాల్వల పరిసరాల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు.
Read also: SRH Vs CSK IPL 2024: సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరోసారి విజృంభిస్తుందా..?!
మొన్నటి వరకు బొబ్బిలి పులి భయంతో బంబేలిత్తిన ప్రజలు, ఇప్పుడు ఏనుగు సంచారంతో బయటకు వెళ్లాలంటే భయంతో జంకుతున్నారు. దీంతో అధికారులు నిన్నటి నుంచి ఏనుగును పట్టుకునేందుకు సర్ఛ్ ఆపరేషణ్ మొదలు పెట్టారు. డ్రోన్ కెమెరాలతో ఏనుగు కదలికల పై ఆరా తీస్తున్నారు. ఏనుగుకు సరిపడా ఆహారం ఇక్కడ దొరికే అవకాశం లేదని, అంతా సైలెంట్ గా ఉంటే ఇక్కడికి వచ్చిన ఏనుగు తన దారి వెంట వెళ్ళిపోతుందని అంచనా వేస్తున్న అధికారులు. మూడు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పెంచికల్ పేట్, బెజ్జూర్, దహెగాం మండలాల్లో ఏనుగు కోసం ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్నరాత్రి కోండపల్లి సమీపంలో బస్ కు ఏనుగు ఎదురురావడంతో.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే రాత్రి అంత గాలించగా ఏనుగు జాడ దొరకక పోవడంతో ఎటువైపు వెళ్లిందనే కోణంలో అటవీశాఖ సిబ్బంది ట్రాక్ చేస్తున్నాఉ.
CSK vs SRH: ఇప్పుడు హైదరాబాద్ వంతు.. ఎక్కడ చూసినా ధోనీ నామస్మరణే! జోరుగా బ్లాక్ టికెట్ల దందా