Mermaid Show Kukatpally: హైదరాబాద్ లో ప్రత్యక్షమైన సాగర కన్యలు.. చూసేందుకు ఎగబడ్డ జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mermaid Show Kukatpally: హైదరాబాద్ నగరంలో సాగర్ కన్యలు కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. కూకట్ పల్లిలోని మెట్రో ట్రక్ పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ అండర్ వాటర్ టన్నెల్ లో జలకన్యలు సందడి చేస్తున్నాయి. కుకట్‌పల్లిలో దేశంలోనే మొట్టమొదటి నీటి అడుగున టన్నెల్ ఎగ్జిబిషన్, మెర్‌మైడ్ షో అద్భుతం అనిపించేలా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రదర్శనలు ఇచ్చే ఆరుగురు యువతులను ఇక్కడి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించేందుకు నగరానికి తీసుకొచ్చారు. వీరంతా స్పెయిన్‌కు చెందిన వారు. మత్స్యకన్యలుగా పేరొందిన వీరు సాగర కన్య వేషధారణతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంతర్గత నీటి టన్నెల్‌లో ప్రత్యేక డ్రెస్‌లో ఆక్సిజన్ లేకుండా స్విమ్మింగ్ చేస్తున్నారు. వారి ఈ ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకు ముందు దుబాయ్, థాయిలాండ్ మరియు హాంకాంగ్ వంటి దేశాల్లో మాత్రమే ఈ ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయి.
Read also: TS Inter Supplemetary: నేటి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
అయితే దేశంలోనే తొలిసారిగా భాగ్యనగరంలో నిర్వహిస్తున్న ఈ షోకు సందర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ప్రదర్శన కోసం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 600 అరుదైన చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా ఇక్కడ స్కూబా డ్రైవింగ్ కూడా మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ ఎగ్జిబిషన్ మరో నెల రోజుల పాటు ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాగర కన్యల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. పూర్తి ప్రదర్శన కోసం టిక్కెట్ ధరలు ఇవ్వబడ్డాయి. పెద్దలకు రూ. 150, ఒక్కో చిన్నారికి రూ.120 అని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తంగా నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రత్యేక అనుభూతిని పొందవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
TS Inter Supplemetary: నేటి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!