NTV Telugu Site icon

TS Schools Reopen: తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా మోగిన బడి గంట‌

Schools

Schools

వేస‌వి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి సోమ‌వారం (జూన్ 13) నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకుంటున్నాయి. సుమారు 60 లక్షల మంది విద్యార్ధులు బడిబాట పట్టనున్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ పూర్తవకపోవడం, వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతన్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారన్న ప్రచారం జరిగినా.. ఆ ఊహాగానాలకు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెరదించారు. జూన్ 13వ తేదీ నుంచి యథావిథిగా పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని స్పష్టం చేసారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 26 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. రెసిడెన్షియల్, కస్తూరిబా బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్ల‌లో మరో 2.5లక్షల మంది విద్యార్ధులున్నారు. ఒక 10,800ల ప్రైవేటు స్కూళ్లలో దాదాపు 32లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. మొత్తం 60 లక్షల మంది నేటి నుంచి బడి బాట పట్టనున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత ఈ విద్యాసంవత్సరంలోనే సకాలంలో స్కూళ్లు ప్రారంభమవుతుండటం గమనార్హం.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మర ఊరు-మన బడి కార్యక్రమం కింద పాఠశాలల్లో సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతుల్లో ఆంగ్ల ( ఇంగ్లీష్‌) బోధన మొదలవనుంది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం 80,000ల మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిద్దం చేసింది. అంతేకాకుండా రెండు భాషల్లో ముద్రించిన పాఠ్యపుస్తకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముద్రించింది.

కాగా.. రెండు సంవ‌త్స‌రాలు ఇంట్లో ఆన్‌లైన్ పాఠాలకు అల‌వాటు ప‌డిన విద్యార్థులు ఇప్పుడు స్కూల్ బ్యాగుల‌తో బ‌డిద‌గ్గ‌ర క‌న‌బ‌డ‌నున్నారు. రెండేళ్ల త‌రువాత పాఠ‌శాల త‌ర‌గ‌తి గ‌దిలో అడుగు పెట్ట‌నున్నారు. కోవిడ్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌న్న త‌రుణంలో మ‌ళ్లీ కోవిడ్ కేసులు పెరుతున్న నేప‌థ్యంలో.. విద్యారంగం బ‌డి తెర‌వ‌డంపై కొంద‌రు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విద్యార్జ‌తులు బడిబాట ప‌ట్ట‌డంతో.. పాఠ‌శాల ప్రాంగ‌ణాలు విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌తో సంద‌డిగా మారడంతో.. బ‌డుల‌న్నీ క‌ళ‌క‌ళ లాడుతున్నాయి.

OnePlus: వన్‌ప్లస్‌ నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది..