Site icon NTV Telugu

తెలంగాణ‌లో స్కూళ్ల రీఓపెన్‌.. విద్యాశాఖ మంత్రి ప్ర‌క‌ట‌న‌

ఒమిక్రాన్ ఎంట్రీతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్రారంభంమైంది.. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లోనూ కోవిడ్ కేసులు క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చాయి.. ఈ నేప‌థ్యంలో.. సంక్రాంతి సెల‌వులు ముగుస్తున్న త‌రుణంలో సెల‌వుల‌ను జ‌న‌వ‌రి 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం.. అయితే, ఈ నెల‌తో సెల‌వులు ముగిసిపోనున్నాయి.. మ‌రోవైపు.. ఆన్‌లైన్‌తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.. తిరిగి ప్రారంభించాల‌నే డిమాండ్ కూడా ఉంది.. దీంతో.. ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధ‌మైంది ప్ర‌భుత్వం.. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.. అయితే, విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని స్ప‌ష్టం చేసిన ఆమె.. స్కూల్ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.

Read Also: స్టీల్ ప్లాంట్ కార్మికుల స‌మ్మె వాయిదా

మ‌రోవైపు.. క‌రోనా ప‌రిస్థితుల‌పై విచార‌ణ సంద‌ర్భంగా.. ఈ నెల 30 త‌ర్వాత విద్యాసంస్థ‌ల‌ను తిరిగి తెరుస్తారా? అంటూ హైకోర్టు.. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే.. దీనికి బ‌దులిచ్చిన ప్ర‌భుత్వం.. ఈనెల 30 తర్వాత పాఠశాలలు తెరుస్తామని హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలు, కాలేజీలు మూసేస్తూ స్కూళ్లు తెరుస్తామని చెప్పడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేస్తూ.. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ అభిప్రాయం ఏంటో తెలిజేయాలని ఆదేశించింది.. ఈ నేప‌థ్యంలో విద్యా సంస్థ‌ల రీఓపెన్‌కే మొగ్గు చూపింది ప్ర‌భుత్వం.. ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు జ‌రుగుతున్నాయి.. ప్రైవేట్ విద్యాసంస్థ‌లు అయితే.. కేజీ టు పీజీ ఆన్‌లైన్ విద్య‌నే భోదిస్తున్నాయి.. కానీ, వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదని, విద్యాసంస్థ‌లు తిరిగి తెర‌వాల‌నే డిమాండ్ క్ర‌మంగా పెర‌గ‌డంతో.. విద్యాసంస్థ‌ల తెరిచేందుకు మొగ్గుచూపింది స‌ర్కార్.

Exit mobile version