కరోనా కారణంగా జనవరి 8 నుంచి జనవరి 16 వరకు, ఆ తరువాత సెలవులను జనవరి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 31తో స్కూళ్లకు సెలవులు ముగియనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తారా లేదా అనే దానిపై ఇప్పటి వరకు సందేహాలు ఉన్నాయి. అయితే, ఫిబ్రవరి 1 వ తేదీన స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ సిద్దమవుతున్నది. స్కూళ్లు తెరిచిన తరువాత విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు పాటిస్తూ స్కూళ్లను ఓపెన్ చేశారు.
Read: వైన్‌తో కరోనాకు చెక్ ..!?
గత రెండేళ్లుగా విద్యార్థులకు సరైన ఎడ్యుకేషన్ అందడం లేదు. కరోనా కారణంగా చాలా వరకు స్కూళ్లు మూతపడ్డాయి. చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్ ద్వారా తరగతులను నిర్వహిస్తున్నా ప్రత్యక్ష తరగతులకు, ఆన్‌లైన్ విద్యకు చాలా తేడా ఉంటుంది. దీంతో విద్యార్థులు విలువైన విద్యకు దూరం అవుతున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతున్న కారణంగా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆన్‌లైన్‌తో పాటు ప్రత్యక్షంగా స్కూళ్లు తెరిచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నది.
