దసరా పండుగ సందర్భంగా ఈ సారి విద్యార్థులకు భారీగా సెలవులు దొరకనున్నాయి.. తెలంగాణలో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్ పంపించింది… సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులను ప్రకటించింది. వచ్చే నెల 5న దసరా పండుగ ఉండగా.. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నెల 25, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కూడా కలిసివస్తుండడంతో.. మొత్తం 15 రోజుల పాటు సెలవులు వచ్చాయి.. అయితే, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది స్టేట్ కౌంసిల ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రేనింగ్ (SCERT)
Read Also: Civil aviation ministry: తాగి ఫ్లైట్ ఎక్కిన సీఎం..! విచారణకు కేంద్రం ఆదేశం..!
తెలంగాణ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కి SCERT డైరెక్టర్ లేఖ రాశారు.. పాఠశాలల దసరా సెలవులు తగ్గించాలని ఆ లేఖలో కోరారు SCERT డైరెక్టర్… ఇప్పటికే వర్షాలు, జాతీయ సమైక్యత దినం వల్ల 7 పని దినాలు పాఠశాలలు నష్టపోయాయని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో దసరా సెలవులు ఈ నెల 26 నుండి కాకుండా అక్టోబర్ 1వ తేదీ నుండి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. లేదా అన్ని రెండో శనివారాలను కూడా వర్కింగ్ డేగా ప్రకటించాలని కోరారు.. దీంతో, పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన సెలవులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.