NTV Telugu Site icon

MLC Kavitha: తీహార్ జైల్లో వున్న కవితతో మాజీ మంత్రులు ములాఖత్‌..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ అయి మూడు నెలలు కావస్తోంది. తీహార్ జైలులోని 6 కాంప్లెక్స్‌లో కవిత 80 రోజులుగా ఉంటున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు తీహార్‌ జైలులో ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు. కాగా.. రెండు రోజుల క్రితం కవితను ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. అంతేకాదు.. కవితతో కేసీఆర్, కుటుంబ సభ్యులు ఫోన్ లో మాట్లాడుతున్నారు. కవిత యోగ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. కాగా.. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయిన కవిత తీహార్ జైలులో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత, మార్చి 26న, ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు కవితను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు 14 రోజులకు ఒకసారి పొడిగించింది.

Read also: Fire Accident : ఇంట్లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి

తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. మూడు రోజుల సిబిఐ కస్టడీ తర్వాత, సిబిఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని రూస్ అవెన్యూ కోర్టు మే 20 వరకు పొడిగించింది. కోర్టు అనుమతితో జైలులో ఎన్నో పుస్తకాలు చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతోంది కవిత. మద్యం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లను రూస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఇదిలావుంటే, తీహార్ జైలులో ఉన్న కవితను ఆమె భర్త అనిల్ వారానికి రెండుసార్లు కలుస్తున్నారు. కుటుంబ సభ్యులు కవితతో రోజూ ఐదు నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుతున్నారని సమాచారం.
India Coach: రెండేళ్ల పదవీ కాలం ఉండగానే.. భారత కోచ్‌పై వేటు!