Pathan Cheru: పఠాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వివాదం కొనసాగుతుంది. పార్టీలోని పాత, కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చింది. సేవ్ కాంగ్రెస్ – సేవ్ పఠాన్ చెరు స్లోగన్స్ తో కార్యకర్తలు, నాయకులు పఠాన్ చెరులోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
Read Also: Harish Rao: కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే.. తల్లికి వచ్చే పెన్షన్ ఆపడం అన్యాయం!
ఇక, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరుతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పఠాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను సైతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దుర్భాషలాడటంతో ఈ వివాదం మొదలైంది. పార్టీలోని పాత – కొత్త నేతల మధ్య పంచాయితీ సర్దుబాటు చేయాలని హస్తం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చేరికను మొదటి నుంచి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ వ్యతిరేకిస్తు్న్నారు.
Read Also: Rohit Sharma: అయ్యో రాములా.. మళ్లీ నిరాశపర్చిన రోహిత్!
అయితే, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాట శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గూడెం మహిపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక, 2023లో బీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున టికెట్ ఆశించి భంగపడిన నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేసి థర్డ్ ప్లేస్ లో నిలిచాడు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ లో చేరి మెదక్ ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలోని ఆ ముగ్గురు నేతల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు తరుచు రచ్చకెక్కుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం తల పట్టుకుంటుంది.