NTV Telugu Site icon

Governor Tamilisai: ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నా

Gov 1

Gov 1

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. ఈ సందర్బంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్.. 120 ఏళ్ళ చరిత్ర కలిగిన రేణుక ఎల్లమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది …ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నా.. పటాన్ చెరుకి రావడం సంతోషంగా ఉందన్నారు తమిళి సై.ఎల్లమ్మ జాతర మహోత్సవాల్లో పాల్గొన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.

Read Also: Leopard in Home: చంద్రపూర్ జిల్లాలో ఇంట్లో దూరిన చిరుత

ఈసందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు. ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అసురశక్తులపై, దైవ శక్తులు విజయం సాధిస్తే..మంచి జరుగుతుంది..ఆధ్యాత్మికతకు వేదిక మన భారతదేశం..కోవిడ్ లాంటివి కూడా మన దేశంకు ఎక్కువ రాలేదు అంటే మన దగ్గర ఉన్న నైతిక విలువలు,మన శక్తి వల్లే..దేశాన్ని విశ్వగురు చేయాలి అంటే..130 కోట్ల మందిని ఏకం చేయాల్సిన అవసరం ఉందన్నారు బండారు దత్తాత్రేయ. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, బీజేపీ కార్పొరేటర్లు, స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Read Also: Balakot Airstrike: బాలాకోట్ వైమానిక దాడులకు నాలుగేళ్లు.. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న ఇండియా