JaggaReddy: సంగారెడ్డి పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ దగ్గర గంజి మైదాన్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్సులో మహిళలు ప్రయాణం చేస్తున్నారు.. 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు దీన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి.. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బియ్యం తక్కువ ఉన్నా తినే వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు ఉంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మెల్లమెల్లగా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు.
Read Also: Tollywood : ఫేడవుటౌతున్న దర్శకులకు ఛాన్సులిస్తున్న హీరోలు
ఇక, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు ఇలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇక, సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డుల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అని కోరారు. గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ల వార్డుకు సీఎం రేవంత్ తో మాట్లాడి అన్ని పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఒక్కో వార్డుకు 8 కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తానని జగ్గారెడ్డి తెలిపారు.
