NTV Telugu Site icon

Group 2 Exam: అభ్యర్థుల లగేజ్‌ కోసం రూ.50 వసూలు.. వెనక్కి ఇచ్చేయాలని కలెక్టర్ ఆదేశం

Sangareddy

Sangareddy

Group 2 Exam: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీజీపీఎస్సీ పోలీసుల సహకారంతో పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మరికొద్ది క్షణాల్లో పరీక్ష ప్రారంభం కానుండగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాలలో వద్ద గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనకు దిగారు.

Read also: Kawasaki: స్పోర్ట్స్ బైక్ వాడే వారికి శుభవార్త.. ఈ బైకుపై భారీ తగ్గింపు

యాజమాన్యం లగేజ్ కౌంటర్ వద్ద ఒక్కో అభ్యర్థి నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తను ఎన్ టీవీలో ప్రసారం చేసింది. దీంతో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. ఎన్టీవీ వార్త కథనాలతో కాలేజీ వద్దకు జిల్లా కలెక్టర్‌ చేరుకున్నారు. లగేజ్ కోసం గ్రూప్-2 అభ్యర్థుల వద్ద తీసుకున్న రూ.50 వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించారు. మళ్ళీ ఇటువంటి ఘటనలు రిపీట్ కావొద్దని హెచ్చరించారు.

Read also: Eluru Crime: ఏలూరులో దారుణం.. యువకుడిని మందలించిన బాలిక తండ్రి మృతి!

ఎంఎన్‌ఆర్‌ మెడికల్ కాలేజీ వద్ద అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్ద గ్రూప్‌-2 అభ్యర్థులు ఇవాళ ఉదయం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. లగేజీ కౌంటర్‌లో ఒక్కో అభ్యర్థి నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిరుద్యోగ అభ్యర్థులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా సెల్‌ఫోన్లు, లగేజీలు పెట్టుకునేందుకు రూ.50 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ కళాశాల యాజమాన్యం దురుసుగా సమాధానం చెబుతోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Eluru Crime: ఏలూరులో దారుణం.. యువకుడిని మందలించిన బాలిక తండ్రి మృతి!

ఈ ఘటనపై టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి పరీక్ష సమయం సమీపించడంతో అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ యాజమాన్యం వద్దకు వెళ్లి హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని వార్నింగ్‌ ఇచ్చారు.
Beauty Tips: చలికాలంలో మెరిసే చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్‌లను ట్రై చేయండి..

Show comments