Eatala Rajendar: 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను లగచర్లకు వెళ్లకుండా ఆపుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. సంగారెడ్డి జైలులో వున్న లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారినీ ఈటల పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దుర్మార్గంగా ప్రవర్తించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరన్నారు. కానీ బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటి..? అని ప్రశ్నించారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: DK Aruna: సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..?
కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని ఈ దాడులు చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామన్నారు. సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుందన్నారు. రైతుకు సంకెళ్లు, తర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు అక్కడ ఏముందని పెత్తనం చేలాయిస్తున్నావ్ అని మండిపడ్డారు. గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుందన్నారు. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. లగచర్ల వెళ్తున్నాము.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఉరుకోమని ఈటల రాజేందర్ హెచ్చారించారు.
V.C. Sajjanar: అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదే..!! సజ్జనార్ ట్వీట్ వైరల్..