Site icon NTV Telugu

Sangareddy Collector Sharat: కేసీఆర్ అభినవ అంబేద్కర్.. పొగడ్తలతో ముంచెత్తిన కలెక్టర్

Srd1

Srd1

టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ ని పొగడడం మామూలే. కానీ, ఓ జిల్లా కలెక్టర్ సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ నుఅభిపవ అంబేద్కర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ముగింపు లో సీఎం కేసీఆర్ పై కలెక్టర్ శరత్ ఈ కామెంట్లు చేయడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అభినవ అంబేద్కర్, నేను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని చూడలేదు.. సీఎం కేసీఆర్ రూపంలో ఇప్పుడు చూస్తున్నాం అంటూ తనదైన రీతిలో వ్యాఖ్యలు చేశారు కలెక్టర్ శరత్.

Read Also: Prabhas: స్టార్ హీరోయిన్ తో ప్రభాస్ ఎఫైర్.. ఈ టైమ్ లో అవసరమా..?

ఆనాడు అంబేద్కర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతి కోసం అన్ని అంశాలు పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించారు.. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు పొందుపరిచారు…గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించడం పై సంతోషంగా ఉంది.. దేశ చరిత్రలో ఒక సంచలమైన నిర్ణయం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం…భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని సంచలన నిర్ణయం తీసుకున్నారు..గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు.. నేనూ ఒక గిరిజన బిడ్డనే అన్నారు కలెక్టర్ శరత్.

గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కూడా సీఎం కేసీఆర్ ని ప్రశంసించిన సంగతి తెలిసిందే. పైగా, కలెక్టర్ గా వున్న వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ కాళ్ళకి మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. రాజకీయాల్లో ఆసక్తితో ఆయన తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనకు ఎమ్మెల్సీ సీటు కూడా ఇచ్చారు సీఎం కేసీఆర్. దీనిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం.

గతంలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి .. ఇప్పుడు ఎమ్మెల్సీ 

1996లో గ్రూప్‌-1 అధికారిగా ఎంపికైన ఆయన మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలలో ఆర్డీవోగా పనిచేశారు. 2007లో ఐఏఎస్‌ హోదా పొంది… మెదక్‌లో డ్వామా పీడీగా, హుడా సెక్రటరీగా, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌గా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో 2021లో సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 నవంబర్ లో కలెక్టర్ పదవికి రాజీనామా చేసి కేసీఆర్ ఇచ్చిన బంపర్ ఆఫర్ అందుకుని ఐఎఎస్ కాస్తా..ఎమ్మెల్సీ అయిపోయారు. తాజాగా శరత్ అడుగులు ఎటువైపు పడతాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: Influenza Cases Rise: పుదుచ్చేరిలో ఇన్‌ఫ్లూయెంజా కలకలం.. స్కూళ్లు మూసేయాలని ఆదేశం

Exit mobile version