NTV Telugu Site icon

Sandhya Convention MD Arrest: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట్.. కారణం ఇదే..

Sandhya Convection Md Arrest

Sandhya Convection Md Arrest

Sandhya Convention MD Sridhar Rao arrested: సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్యా శ్రీధర్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. మధ్యతరగతి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినైనా మోసం చేయడం ఇలా అరెస్ట్ కావడం ఆయనకు ఇది నాలుగోసారి. ఇటీవల అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసిన శ్రీధర్ మరోసారి పోలీసులకు చిక్కాడు. ట్రాక్టర్లు ఇస్తానని చెప్పి రూ. 250 కోట్లు మోసం చేశారంటూ అమితాబ్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీధర్‌ వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ రావు కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్‌ లో శ్రీధర్ రావు ఉన్నట్లు సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.

Read also: Mother Agony: కొడుకు కోసం తల్లి ఆరాటం.. మృత్యువుతో పోరాడుతున్న కన్నబిడ్డ

అలాగే శ్రీధర్ రావు గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. శ్రీధర్ రావు హైదరాబాద్‌తో పాటు ముంబైలో పలువురు బిల్డర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా శ్రీధర్‌రావుపై గతంలో అసహజ లైంగిక వేధింపుల కేసు కూడా నమోదైంది. జిమ్ ట్రైనర్ అయిన తనపై శ్రీధర్ రావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. సనత్ నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గతేడాది గచ్చిబౌలిలో ఈవెంట్ మేనేజర్‌పై శ్రీధర్‌రావు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ కొన్ని కేసుల్లో అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిల్ పై విడుదలయ్యారు.

Read also:Asaduddin Owaisi: అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఇది నాల్గవసారి అంటూ సీరియస్

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును పోలీసులు నవంబర్ 10న రాయదుర్గం పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్ ఓ భవన నిర్మాణానికి సంబంధించి పలువురిని మోసం చేశాడని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో శ్రీధర్‌‌పై రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరయ్యారు. శ్రీధర్ రావు ఎన్ఆర్ఐ ముక్కామల అప్పారావు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ సభ్యురాలు తులసిని మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. 28 వేల ఎస్ ఎఫ్ టీ స్థలానికి రూ.15 కోట్లు అడ్వాన్స్ తీసుకుని తిరిగి ఇవ్వలేదని శ్రీధర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐసీఐసీఐ సమీపంలోని 12 ఎకరాల భూమికి సంబంధించి శ్రీధర్‌కు మరో వివాదం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా బిగ్‌బి బంధువుకే ఎసరు పెట్టడంతో శ్రీధర్‌ రావును అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు ఢిల్లీ పోలీసులు.
Mlc Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి నోటీసులు.. ఈనెల 21న విచారణకు హాజరుకావాలి లేదంటే..

Show comments