Site icon NTV Telugu

Sand Mafia : చెక్ డ్యాంను రాత్రికి రాత్రి కూల్చివేసిన దుండగులు,

Sand

Sand

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో గల చెక్ డ్యాము ను గుర్తు తెలియని దుండగులు పేల్చివేశారు. గుంపుల మానేరు వద్ద గల చెక్ డ్యాం ను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పేల్చివేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. గుంపుల మానేరు పై ఉన్న చెక్ డ్యామ్ ను సుమారుగా 19 కోట్లతో నిర్మించిన ఈ చెక్ డ్యామును , వ్యవసాయ భూమికి వినియోగించుకునే నీరు సుమారు 6 వేల ఎకరాల భూమి సాగు వినియోగంలో ఉండేదని ఈ ఇసుక మాఫియా దుండగులు రాత్రి రాత్రి పేల్చి పేల్స్ వేసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని రైతులు ఆందోళన చెందారు.

Ustad Bhagat Singh : హరీష్ శంకర్‌కు టార్గెట్ టెన్షన్

గుంపుల మానేరు ఒడ్డున ఉన్న దేవాలయానికి సుమారుగా రోజుకు 500 మంది భక్తులు వచ్చి ఇక్కడ పుణ్య స్థానాలు ఆచరించి దేవుని దర్శనం చేసుకొని వెళ్లేవారని ఈరోజు ఈ చెక్ డాం పేల్చివేయడంతో వాటర్ అంతా కిందికి వెళ్లిపోయాయని దానివల్ల భక్తులకు ఆటంకం ఇబ్బందులకు గురైనట్లుగా తెలిపారు. చెక్ డ్యామ్ ను పేల్చివేసిన ఇసుక మాఫియా దుండగులపై వెంటనే చర్యలు చేపట్టాలంటే గ్రామస్తులు కోరుతున్నారు.

Bharat Bandh: రేపు బంద్‎ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

Exit mobile version