కొత్తగూడెంలోని సింగరేణి గనుల్లో సమ్మె సైరన్ మోగింది. నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐదు డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. కార్మికుల డిమాండ్లు ఏంటంటే… కళ్యాణి ఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకోవడం, అన్‌ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40 ఏళ్లకు పెంచడం, కార్మికుల అలియాస్ పేర్లను మార్చడం, ఏడాది నుంచి మెడికల్ బోర్డు సమావేశం నిర్వహించనందున తక్షణమే మెడికల్ బోర్డును ఏర్పాటు చేయడం, మెడికల్ బోర్డు లేని కారణంగా డిపెండెంట్ల వయసు పెరగడంతో వారికి అవకాశం ఇవ్వడం.
Read Also: మనోభావాలు దెబ్బతింటే, ఇంకేదైనా చదవండి:ఢిల్లీ హైకోర్టు
తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధికారులకు కార్మిక సంఘాలు నోటీసులు అందజేశాయి. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే డిసెంబర్ 9 తర్వాత సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి.
