జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో కస్టడీ విచారణ లో ఇప్పటికే కీలక విషయాలు వెల్లడించిన ఏ 1 నిందితుడు సాదుద్దీన్, మొదటిరోజు 6 గంటలు పాటు పోలీసులు విచారణ చేసారు. సాదుద్దీన్ మాలిక్ కస్టడీ విచారణలో వెల్లడించిన స్టేట్మెంట్ నేడు కీలకంగా మారనుంది. మే 28న ఘటన జరిగిన అనంతరం ఆ మరుసటి రోజు ఏం జరిగిందన్న దానిపై పోలీసుల అరా తీస్తున్నారు.
సాదుద్దీన్ విచారణలో వెల్లడి:
మే 28 న అనుమానం వచ్చి అదే రోజు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో నిందితులను కలిసేందుకు హాది, వారి స్నేహితులు వచ్చినట్లు మాలిక్ విచారణలో వెల్లడించాడు. హాది , మైనర్ బాలిక మధ్య వాగ్వాడం జరిగిందని తెలిపాడు. పోలీస్ కంప్లయింట్ ఇస్తా అని చెప్పగా మమ్మల్ని ఏం చేయలేరంటూ మా వెనుక పొలిటికల్ పవర్ ఉందంటు మైనర్ లు సమాధానం ఇచ్చారంటు మాలిక్ వెల్లడించారు. వాగ్వాదం అనంతరం ఎవరి ఇంటికి వాళ్లు వెళ్ళిపోయామన్నాడు. మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని తెలియగానే అందరం ఎక్కడివారు అక్కడి నుండి ఎస్కేప్ అయ్యామని మాలిక్ తెలిపాడు. ఇవాళ రెండవ రోజు సాదుద్దీన్ మాలిక్ ను ఐ.ఓ. బంజారాహిల్స్ ఏసిపి సుదర్శన్ విచారణ జరపనున్నట్లు తెలిపారు.
బాధితురాలి ఫ్యామిలీ పై ఫోకస్ పెట్టిన నిందితులు:
అత్యాచారం చేసిన తరువాత నిందితులు మూడు రోజుల పాటు బాధితురాలి ఫ్యామిలీ పై ఫోకస్ పెట్టారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు నిందితులు. మే 31 వరకు వెయిట్ చేసిన నిందితులు, 31 న బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగానే ముగ్గురు నిందితులు సిటీ వదిలి వెళ్లిపోయారు.
బంజారాహిల్స్ లో నివాసం ఉండే ఒక నిందితుడు తమ కుటుంబంతో కలిసి తమిళనాడుకు పరార్ అయ్యాడు. మరో నిందితుడు గోవా కు పరారీ కాగా.. ఇంకో నిందితుడు కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ కి పరారీ అయ్యాడు. నిందితులు తమ ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేయడం తో నిందితుల కుటుంబ సభ్యులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఏపీ, తమిళ నాడు, గోవా లకు స్పెషల్ టీమ్స్ తో జెల్లెడ పట్టి.. ఎట్టకేలకు 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు.
గ్యాంగ్ రేప్ కేస్ లో నేడు మైనార్ల విచారణ :
A2 A3 A4 లను విచారించేందుకు జువైనల్ కోర్ట్ అనుమతించింది. ఐదు రోజుల పాటు మైనర్లు పోలీస్ కస్టడీలో వున్నారు. జువైనైల్ హోం లో నే వారిని విచారించే అవకాశం వుంది. ఇప్పటికే సాద్ధిదీన్ మాలిక్ ను విచారిస్తున్న పోలీసులు.. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో సాదుద్దీన్ మాలిక్ ను ఈరోజు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు.