Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదాబైనామాల క్రమబద్ధీకరణపై రెవెన్యూశాఖ తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ భూ భారతి చట్టం, 2025లోని సెక్షన్ 6, సబ్-సెక్షన్ (1) ప్రకారం నమోదుకాని లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు నమోదుకాని లావాదేవీల (సాదాబైనామాలు) కింద రైతులు దాఖలు చేసిన దరఖాస్తులను ఇప్పుడు ప్రాసెస్ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Kishkindhapuri : కిష్కింధపురి.. ప్రీమియర్.. బెల్లంకొండకు ఓ మంచి హిట్
దీని ద్వారా అప్పట్లో పెండింగ్‌లో ఉన్న వేలాది కేసులకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం సుమారు 9,00,894 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరికి సంబంధించిన భూములపై అధికారిక ధ్రువీకరణ లభించే అవకాశం ఉందని అంచనా. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బి ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీని వలన రైతుల భూములకు చట్టపరమైన రక్షణ లభించనుంది.
TWM Sequel : నిర్మాత – డైరెక్టర్ కు మధ్య వివాదం.. ఆగిన సూపర్ హిట్ సినిమా సీక్వెల్
