Site icon NTV Telugu

Sabita Indra Reddy ఫేస్ టు ఫేస్: జీవో 111 రద్దు చారిత్రాత్మకం

Sabita 1

Sabita 1

తెలంగాణలో111 జీవో రద్దు హాట్ టాపిక్ అవుతోంది. ఇంత హడావిడిగా ఎందుకు జీవో రద్దుచేయడం ఎందుకని అడిగితే.. సీఎంకి ధన్యవాదాలు తెలపాలన్నారు. గతంలో అంతా ఎన్నికల హామీగా మారిపోయింది. సీఎం దీనిని రద్దుచేయడం అభినందనీయం. 111 జీవో వల్ల రైతులు భూములు అమ్ముకోలేరు. బ్యాంక్ లోన్లు, ఇల్లు కట్టుకోలేరు. రైతులకు సీఎం కేసీఆర్ ఎంతో మేలుచేశారన్నారు మంత్రి సబిత. చీకటి నుంచి మనం వెలుగులోకి వచ్చాం. 25 సంవత్సరాల నుంచి వున్న జీవో ఇది. ఈ జీవో అశాస్త్రీయంగా వుంది. చెరువుకి ఎంతో దూరంగా వున్నవాటిని ఇక్కడికి తెచ్చారు. రాజకీయకోణంలో 1996లో జీవో తెచ్చారన్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి NTV ఫేస్ టు ఫేస్ లో అనేక విషయాలు ప్రస్తావించారు.

రెండు చెరువుల నుంచి అంతగా నీరు నగరానికి రావడం లేదు. ఈ జీవో వల్ల చెక్ డ్యామ్ లు కట్టుకోలేకపోయాం. ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ చెరువులు నీరు వాడుకున్నాం. కాబట్టి అప్పుడు జీవో రద్దుచేయడం కుదరలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ జీవో రద్దుచేయలేదన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. న్యాయవివాదాలు వున్నప్పుడు జీవో రద్దుచేయడం ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి సబిత ఇంద్రారెడ్డి NTV ఫేస్ టు ఫేస్ లో అనేక విషయాలు ప్రస్తావించారు.

రైతులు తమ పిల్లల పెళ్ళికి భూములు అమ్మడం కుదరలేదు. 10 కోట్లు విలువైన భూములు 1లక్షకు అమ్ముకుని నష్టపోయారు. అనేక గ్రామాలు ఈ జీవోలోకి రావడం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. పకడ్బందీ ప్లాన్ ద్వారా అమలుచేస్తాం. గ్రీన్ ట్రిబ్యునల్ కి మాఅబ్బాయి కార్తీక్ రెడ్డి వెళ్ళారు. జీవోని సవరించమని అడిగాం. 84 గ్రామాల రైతులు పండుగ చేసుకుంటున్నారు. శంషాబాద్‌ లో రైతులు ఎంతో ఆనందంగా ఉండాలి. కానీ కేసీఆర్ జీవో రద్దుచేయడం చారిత్రాత్మకం. ఈ జీవోకి హైదరాబాద్‌కి అసలు సంబంధం లేదు. గండిపేట చెరువును డెవలప్ చేయడానికి 100 కోట్లు ఖర్చుపెడతాం. హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గదు. బోర్ల వేయకుండా అడ్డుకున్న గ్రామాల ప్రజల పరిస్థితి గురించి ఎందుకు ఆలోచించలేదు. బీజేపీ నేతలు చేయాలనుకుంటున్న ఉద్యమం హాస్యాస్పదం. ఈ జీవోని అంతా స్వాగతించాలి. హర్షించాలన్నారు మంత్రి సబిత.

జీవో 111 రద్దు చేయాలని రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా తెరమీదకు తెచ్చాం. రెండు చెరువుల పరిరక్షణకు కట్టుబడి వున్నారు. న్యాయవివాదాలు లేకుండా పని చేస్తే శాశ్వతంగా వుండాలి. రైతుల త్యాగాలు ఇక చాలు అని కేసీఆర్ భావించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చే నీరు హైదరాబాద్‌ కు సరిపోతుంది. వందేళ్ళ తర్వాత రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్డు దగ్గరకు హైదరాబాద్‌ వెళ్ళినా నీటి సమస్య రాదన్నారు మంత్రి సబిత.

రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశం మాకు లేదన్నారు. రాజకీయకోణం గురించి బీజేపీ ఆలోచిస్తోందన్నారు. జీవో రద్దు గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. మా గ్రామాలకు వెళ్ళి జీవో వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ప్రజల్ని అడిగి తెలుసుకోండి.టీఆర్ఎస్ నేతల కోసం జీవో రద్దుచేశామనడం దిగజారుడు రాజకీయమే. ఈ జీవో రద్దుచేయడం వల్ల మీ బాధేంటి? ఇక్కడ అనేకమందికి భూములు వున్నాయి. అక్కడ కేసీఆర్, కేటీఆర్ భూములున్నాయని అంటున్నారు. మరి ఇక్కడి భూములు వారికి ఇచ్చేస్తారా అని మంత్రి సబిత ప్రశ్నించారు.

మొత్తం భూములు రియల్ ఎస్టేట్ వారి చేతిలో లేవు. ఈ ప్రాంత ప్రజలు వెలుగులోకి రావాలని అంతా భావించాలి. రైతులకు న్యాయం చేయాలంటున్నారు. భూకుంభకోణం ఎక్కడ జరిగింది? ఏం విచారణ చేస్తారు? భూమి, ఆకాశం ఏకమయ్యాయా? పేదలు వచ్చి కంప్లైంట్ చేస్తారు మీకెందుకు ఈ బాధ. ప్రాంతంపై అభిమానం ఉంటే జీవో111 రద్దు గురించి రాద్ధాంతం చేయవద్దు. జీవో వల్ల ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి చేకూరుతుంది. కమిటీ అన్ని విషయాలు చర్చిస్తుంది. పర్యావరణ వేత్తలు కూడా ఆలోచించాలి.

ప్రభుత్వం మంచి పని చేస్తే రాజకీయంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వడ్లను కొంటుంటే రాజకీయం చేస్తున్నారు. మెడలు వంచి కొనిపించాం అని బీజేపీ వాళ్ళు అనడానికి సిగ్గుండాలి. కింద పడ్డా నేనే హీరోని అన్నట్టుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు మంత్రి సబిత.

Exit mobile version