RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
- రమ్మీకల్చర్ సహా గేమింగ్ సంస్థలపై ఈడీ చర్యలు
- బాట్స్‌తో యూజర్లను మోసం చేశారన్న ఆరోపణ
- మార్కెటింగ్ కోసం రూ.1,035 కోట్ల ఖర్చు
- కేసులో ఇప్పటివరకు రూ.2,843 కోట్ల ఆస్తులు అటాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు కేంద్రంగా రమ్మీకల్చర్ యాప్ సహా పలు ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ సంస్థలకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద సుమారు రూ.442.35 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 25, 2026న PMLAలోని సెక్షన్ 5(1) కింద ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
అటాచ్ చేసిన ఆస్తుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లలోని నగదు నిల్వలు, వాణిజ్య దుకాణాలు, ఓ విల్లా, పలు నివాస ఆస్తులు ఉన్నాయి. ఇవి M/s Gameskraft Technologies Pvt. Ltd. వాటాదారుల కుటుంబ సభ్యులు, ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్టులు, అనుబంధ సంస్థల పేర్లలో ఉన్నట్లు ఈడీ తెలిపింది. తెలంగాణలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసులో PMLA కింద దర్యాప్తు ప్రారంభించింది. మోసం (Cheating)కు సంబంధించిన నేరాల కింద నమోదైన ఈ ఎఫ్ఐఆర్లు PMLA పరిధిలోని షెడ్యూల్డ్ నేరాలకు సంబంధించినవిగా ఈడీ పేర్కొంది.
Also Read
దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు 2026 మే 7 నుంచి 14 వరకు, జూన్ 20 నుంచి 21 వరకు Gameskraft Technologies కార్యాలయాలు, సంస్థ డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. PMLAలోని సెక్షన్ 17 కింద చేపట్టిన ఈ తనిఖీల్లో పలు పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.
ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో Gameskraft Technologies, RummyTime Technologies సంస్థలు ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్, ముఖ్యంగా ఆన్లైన్ రమ్మీ గేమ్స్, టోర్నమెంట్లను నిర్వహించినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది. RummyCulture, RummyPrime, Playship, RummyTime తదితర బ్రాండ్ల పేర్లతో మొబైల్ యాప్‌ల ద్వారా ఈ గేమ్స్ నిర్వహించినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ ప్లాట్‌ఫార్మ్‌లకు సుమారు 3 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్‌పై నిషేధాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా గణనీయ సంఖ్యలో యూజర్లు ఈ ప్లాట్ఫార్మ్లను ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది. యూజర్లు డిపాజిట్ చేసిన బెట్టింగ్ లేదా స్టేకింగ్ మొత్తాలపై 10 నుంచి 15 శాతం వరకు ప్లాట్ఫార్మ్ కమిషన్ వసూలు చేయడం ద్వారా కంపెనీలు భారీగా ఆదాయం పొందినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొంది.
అయితే ఈ గేమింగ్ ప్లాట్ఫార్మ్లు యూజర్లకు పారదర్శకంగా, న్యాయబద్ధంగా పనిచేస్తున్నామని చెప్పినప్పటికీ.. వారి అనుమతి లేదా అవగాహన లేకుండా ఆటోమేటెడ్ ప్లేయర్లు, అంటే BOTsను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఈడీ ఆరోపించింది. ఈ BOTs కారణంగా యూజర్లు భారీగా ఆర్థిక నష్టాలకు గురయ్యారని, అదే సమయంలో కంపెనీలకు నేరం ద్వారా వచ్చిన ఆదాయం సమకూరిందని తెలిపింది.
యూజర్లను ఆకర్షించేందుకు కంపెనీలు భారీగా మార్కెటింగ్, ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈడీ పేర్కొంది. కొత్త యూజర్లను తీసుకురావడం, ఇప్పటికే ఉన్నవారిని కొనసాగించడం కోసం సుమారు రూ.1,035 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. బోనస్‌లు, రిఫరల్ ప్రోత్సాహకాలు, ఉచిత టోర్నమెంట్ ఎంట్రీలు, ప్రమోషనల్ రివార్డుల ద్వారా యూజర్లను ఆకర్షించి, మరింత మొత్తాలను డిపాజిట్ చేసేలా ప్రోత్సహించినట్లు పేర్కొంది.
కొన్ని సందర్భాల్లో డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు 5 నుంచి 10 శాతం వరకు విత్‌డ్రాయల్ లెవీ విధించినట్లు కూడా ఈడీ తెలిపింది. ‘Super Booster’ వంటి ఆఫర్ల ద్వారా విత్‌డ్రా చేసుకోగల నగదు నిల్వలను విత్‌డ్రా చేసుకోలేని ‘Game Cash’గా మార్చుకునేలా యూజర్లను ప్రోత్సహించినట్లు పేర్కొంది.
గేమ్స్ ఆడటం నిలిపివేసిన, భారీగా నష్టపోయిన యూజర్లను కూడా తిరిగి గేమింగ్‌లోకి తీసుకురావడానికి ప్రత్యేక పద్ధతులు ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది. తక్షణ నగదు క్రెడిట్లు, ప్రమోషనల్ ఆఫర్లు, పుష్ నోటిఫికేషన్లు, ఎస్ఎంఎస్ క్యాంపెయిన్లు, టెలిమార్కెటింగ్ కాల్స్ ద్వారా వారిని మళ్లీ బెట్టింగ్ వైపు తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ విధానాల ద్వారా యూజర్లు పదేపదే బెట్టింగ్ చేసే పరిస్థితి ఏర్పడిందని, తద్వారా కంపెనీలకు కమిషన్ రూపంలో భారీగా నేర ఆదాయం వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ తెలిపింది.
ఈ కార్యకలాపాల ద్వారా వచ్చిన నేర ఆదాయాన్ని వాటాదారులకు డివిడెండ్లు, షేర్ బైబ్యాక్‌ల రూపంలో చెల్లించడం ద్వారా నిధులను లేయరింగ్, ఇంటిగ్రేషన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఈడీ పేర్కొంది. అనంతరం ఈ మొత్తాలను మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, కన్వర్టిబుల్ నోట్లు, ఈక్విటీ షేర్లు, చరాస్తులు, అధిక విలువైన స్థిరాస్తుల్లో పెట్టుబడులుగా మార్చినట్లు తెలిపింది. కుటుంబ ట్రస్టులు, అనుబంధ సంస్థల పేర్లతో కూడా పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ పేర్కొంది.
ఇదే కేసులో గతంలో నిర్వహించిన సోదాల సమయంలో సుమారు రూ.495 కోట్ల విలువైన చరాస్తులను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది. రూ.11 లక్షల నగదు, సుమారు 2.30 కిలోల బంగారం, వజ్రాల ఆభరణాలు, బులియన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అప్పట్లో సుమారు రూ.1,906 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేస్తూ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేసినట్లు వెల్లడించింది.
తాజాగా అటాచ్ చేసిన రూ.442.35 కోట్ల ఆస్తులతో కలిపి, కేసు దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అటాచ్ చేసిన, ఫ్రీజ్ చేసిన, స్వాధీనం చేసుకున్న ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మొత్తం విలువ సుమారు రూ.2,843 కోట్లకు చేరినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.
తాజావార్తలు
-
RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
-
Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?