Site icon NTV Telugu

TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!

Tgsrtc

Tgsrtc

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మంత్రుల బృందం , ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య జరిగిన తాజా చర్చల్లో పురోగతి సాధించినట్లు సమాచారం. ఈ భేటీలో ఉద్యోగులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 29 డిమాండ్లకు సమ్మతించింది సర్కార్.. అయితే.. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కీలక చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం జరిగితే, గుర్తింపు ఎన్నికలు (Recognition Elections), పీఆర్‌సీ (PRC) వంటి అంశాలు స్వయంగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఉద్యోగులలో కొంత ఆశావాదం వ్యక్తమవుతోంది.

Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్‌డేట్!

ఇక ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ప్రభుత్వం స్వయంగా చేపడుతుందని, ప్రైవేట్ డ్రైవర్ల నియామకం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇది నగరంలో పనిచేస్తున్న సిబ్బందికి కొంత ఉపశమనం కలిగించే అంశంగా మారింది.

అదేవిధంగా, కారుణ్య నియామకాలపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న ఈ నియామకాలను పర్మినెంట్ పద్ధతిలోకి మార్చి, వారికి స్థిరమైన వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో బాధిత కుటుంబాలకు దీర్ఘకాలిక భద్రత లభించే అవకాశం ఉంది.

మొత్తం మీద, ఈ చర్చలు ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తుపై సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి. ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రుల బృందం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయాలు అధికారికంగా అమలులోకి వచ్చే వరకు ఉద్యోగ సంఘాలు అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాయి. త్వరలోనే ఈ అంశాలపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. మూడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ చర్చలు సఫలమైతే సమ్మె విరమణ దిశగా అడుగులు పడుతాయెమో చూడాలి.

Vadiyalu Recipe : ఎండతో పనేలేదు.. ఒక్కరోజులో ఫ్యాన్ కింద ఆరిపోయే ‘మ్యాజిక్’ వడియాలు.!

Exit mobile version