Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్‌డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalaivar 173 : సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 173వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రజనీ ‘థలైవర్ 173’ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రజనీకాంత్-కమల్ హాసన్-శంకర్ వంటి భారీ కాంబినేషన్ ఈ సినిమాలో ఉండబోతోందనే వార్త ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. దిగ్గజ దర్శకుడు శంకర్, ఈ సినిమాలో రజనీకి విలన్‌గా నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం శంకర్‌ను సంప్రదించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గతంలో రజనీకాంత్-శంకర్ కాంబినేషన్‌లో రోబో, శివాజీ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ హీరో-విలన్లుగా తలపడితే స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో విశేషమేమిటంటే, ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు బజ్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి దర్శకత్వం గతంలో సిబి చక్రవర్తి పేరు వినిపించినా, ఇప్పుడు అశ్విన్ మరిముత్తు పేరు వినిపిస్తుంది. దీనికి సంగీతం రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ క్యారెక్టర్‌కు సంబంధించి దాదాపు 80కి పైగా డిఫరెంట్ లుక్స్‌ను డిజైన్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే శంకర్ విలన్‌గా నటించడం, కమల్ క్యామియోపై, డైరెక్టర్ మొదలైన విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!