NTV Telugu Site icon

VC Sajjanar: వాళ్ల కోసం స్పెషల్ బస్సులు.. సజ్జనార్ కీలక ప్రకటన

Md Sajjanar

Md Sajjanar

VC Sajjanar: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో టీఎస్‌ ఆర్టీసీ శుభవార్త అందించింది. త్వరలోనే.. 2,375 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. ఈ బస్సుల్లో దివ్యాంగుల కోసం కొన్ని స్పెషల్‌ బస్సులను కేటాయించేలా నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. దివ్యాంగులకు కూడా అనౌన్స్ మెంట్, ఎంక్వైరీ రూం ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం ద్వారా బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని స్థానాల్లో మహిళలే ఉన్నారు. పైగా.. సీట్ల కోసం కొట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో.. మరికొందరి పరిస్థితి స్థిమితంగా మారింది. కాగా, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని పురుషులు కూడా మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబ్బున్న పురుషుల పరిస్థితి ఎలా ఉన్నా వికలాంగులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Read also: IRR Scam Case: నేడు చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

దీనిని పరిగణనలోకి తీసుకున్న టీఎస్ ఆర్టీసీ వారి కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆలోచిస్తోంది. ఈ మేరకు.. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. 45 రోజుల్లోనే 12 కోట్ల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. కానీ ఉచిత ప్రయాణం వల్ల వికలాంగులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూడా కూర్చుంటున్నారని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. త్వరలో 2,375 కొత్త బస్సులను తీసుకువస్తామని.. అప్పుడే కొంత ఊరట లభిస్తుందన్నారు. వికలాంగుల కోసం అవసరమైతే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అంధులకు అడ్వర్టైజింగ్, ఎంక్వైరీ రూం ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు.
Read also: Pune: “క్యారెక్టర్‌పై అనుమానం”.. మహిళా టెక్కీని చంపేసిన బాయ్‌ఫ్రెండ్..