NTV Telugu Site icon

TSRTC MD Sajjanar: మేడారం భక్తులకు బిగ్ షాక్.. బస్సుల్లో కోళ్లు , గొర్రెలకు ప్రవేశం లేదన్నసజ్జనార్

Tsrtc Md Sajjanar

Tsrtc Md Sajjanar

TSRTC MD Sajjanar: మేడారం మహాజాతర అంటే చాలా మంది భక్తులు కోళ్లు, గొర్రెలు, మేకలను అమ్మవార్లకు మొక్కుగా సమర్పిస్తారు. మేడారం బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు లైవ్ స్టాక్ ఎంట్రీ లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకురాకుండా భక్తులు సహకరించాలని సజ్జనార్ కోరారు. మేడారం జాతర నేపథ్యంలో వరంగల్‌లోని జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కళాశాలలో మండల శిక్షణ కళాశాల, ఆర్టీసీ రాష్ట్ర స్థాయి అధికారులు, సిబ్బందితో మేడారం జాతర సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సజ్జనార్ హాజరై మేడారం జాతరకు ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Read also: Coconut Milk Benefits : కొబ్బరి పాల వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

మేడారం జాతర నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి ఆయా బస్సులు నడపనున్నట్లు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని, ఈసారి మొత్తం 30 లక్షల మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆయన అంచనా వేశారు. దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆపరేటింగ్ పాయింట్లలో ఆర్టీసీ సిబ్బందిని నియమించారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక బస్టాండ్లలో క్యూ లైన్లతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని మేడారంలో 15 కిలోమీటర్ల మేర 48 క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

Read also: Airtel-Amazon Prime: ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌ ప్లాన్స్.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ వీడియో!

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదాలు జరగకుండా చూడాలని మేడారం బస్సుల్లో ఆర్టీసీ డ్రైవర్లు సజ్జనార్ సిబ్బందికి పిలుపునిచ్చారు. మేడారం మహా జాతరలో 15 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, వారికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జాతర విధులు నిర్వహిస్తున్న బస్సు డ్రైవర్లు జీరో ఫెయిల్యూర్స్‌తో ప్రమాదరహిత జాతరకు కృషి చేయాలని సూచించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో విధులు నిర్వహించాలన్నారు. సంస్థకు మంచి పేరు తీసుకురావడానికి సిబ్బంది కృషి చేయాలి. మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రయాణ పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జాతర మార్గంలో విధులు కేటాయించిన చోటే సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు.
Coconut Milk Benefits : కొబ్బరి పాల వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..