Site icon NTV Telugu

MLA Jeevan Reddy: కవితమ్మ తెలంగాణ బతుకమ్మ.. ఆమె జోలికి వస్తే బతుకు బుగ్గిపాలే..!

Mla Jeevan Reddy

Mla Jeevan Reddy

ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బతుకమ్మ అని.. బతుకమ్మ జోలికి వస్తే బతుకు బుగ్గిపాలేనని పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కవితపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. బీజేపీ రౌడీయిజం, మోడీ ఈడీయిజం తెలంగాణలో నడవదని హెచ్చరించారు. కవితపై ఆరోపణలు చేసిన వారిపై లుక్‌ అవుట్‌ నోటీసులు ఉన్నాయని గుర్తుచేశారు. కవితకు టీఆర్‌ఎస్‌ ఎప్పుడు అండగా వుంటుందని, సీబీఐ, ఈడీ బీజేపీ జేబు సంస్థలుగా, కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు.

అయితే ప్రత్యర్థులను వేదించడానికి బీజేపీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి. కేసు గురించి సంస్థలు చెబుతాయా? బీజేపీ నేతలు చెబుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ప్రకటించారన్నారు. దీనిపై విచారణకు సిద్ధమేనని కవిత ఇప్పటికే ప్రకటించారని స్పష్టం చేశారు. కవిత జోలికి వస్తే యావత్‌ తెలంగాణ కన్నెర్ర చేస్తుందని తెలిపారు.
CM Jagan: రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

Exit mobile version