NTV Telugu Site icon

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పొలిటికల్‌ ఎంట్రీ..? ఆయనే క్లారిటీ ఇచ్చారు..

RS Praveen Kumar

RS Praveen Kumar

ఐపీఎస్‌ పదవికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్‌ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 26 ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. 1995 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌… తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా సేవలు అందించారు. స్వచ్ఛందంగా పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తన మనసుకు ఇష్టమైన పనులు తనకు ఇష్టమైన రీతిలో చేయబోతున్నానని తెలిపారు. అయితే, హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు ముందు ఈ పరిణామం జరగడంతో.. బై పోల్ కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఆయన త్వరలోనే పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది.. దళితుల ఓట్లను టార్గెట్‌ చేసిన టీఆర్ఎస్‌.. మంచిపేరున్న ప్రవీణ్‌ కుమార్‌ను బరిలోకి దింపితే ఈజీగా విజయం సాధించొచ్చు అనే ఆలోచన చేస్తుందనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో మొదలైంది. అయితే, దానిపై క్లారిటీ ఇచ్చారు ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్.. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే చేప్పలేనన్న ఆయన.. హుజురాబాద్‌ ఉప ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం నాకులేదని స్పష్టం చేశారు.. పేదల పక్షాన ఉండాలనే పదవీ విరమణ చేశానని.. స్వేరోస్‌ లోని విద్యార్ధులేవరూ అధైర్యపడొద్దు.. నాకంటే మంచి అధికారులు వస్తారన్నారు. దీంతో.. ప్రవీణ్‌కుమార్‌ పొలిటికల్ ఎంట్రీపై సాగుతున్న ప్రచారానికి తెరపడినట్టు అయ్యింది.