NTV Telugu Site icon

Power Bill: కరెంట్‌ బిల్లు చూస్తేనే షాక్‌.. వందల్లో వచ్చే బిల్లు.. వేలు దాటింది..!

Power Bill

Power Bill

కరెంటు తగిలితే షాక్ వస్తుంది.. కానీ, కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ గురైన సంఘటన ఒకటి వెలుగు చూసింది.. ప్రతినెలా 500, 600 వచ్చే కరెంట్ బిల్లు.. 50వేల రూపాయలు బిల్లును చూసి ఓ ఇంటి యజమాని షాక్ కు గురయ్యాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంటి కరెంట్ బిల్లు 51,249 రూపాయలు వచ్చింది… తనకున్నది మూడు రూమ్‌లేనని, తాను నిరుపేద కుటుంబానికి చెందిన వాడని.. నాకు ఇంత కరెంట్ బిల్లు ఎలా వచ్చిందని ఆశ్చర్యానికి గురయ్యాడు… అయితే, గత మూడు నెలల క్రితం 32000 వేల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని, విద్యుత్ అధికారులకు కంప్లైంట్ చేస్తే వారు మీటర్ రీడింగ్ లో పొరపాటు జరిగిందని, బిల్లును తీసుకొని వెళ్లి 5000 రూపాయాలు కడితే చాలు అని చెప్పి 5000 వేలు యజమానితో కట్టించుకున్నారని తెలిపారు..

Read Also: Rahul Gandhi: మోడీ చేతిలో ఏపీ ప్రభుత్వం కీలుబొమ్మ..! అన్ని పార్టీల రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతిలోనే..!

అయితే, ఈ ఘటన జరిగి రెండు నెలలు గడిచిన అనంతరం మళ్లీ నిన్న విద్యుత్ అధికారులు ఇచ్చిన బ్రీడింగ్ బిల్లులో 4956 యూనిట్ల విద్యుత్‌ వినియోగించినట్టు.. దీనికి గాను 48,241తోపాటు మూడు వేల రూపాయల బకాయి కలిపి మొత్తం 51 వేల 249 రూపాయల కరెంట్ బిల్లు రావడంతో లక్ష్మయ్య కుటుంబం ఆందోళనకు గురైంది.. దీనిపై విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సంప్రదిస్తే.. డీడీ కట్టి మీటర్ మార్చుకోవాలని చెప్తున్నారని, మరోసారి పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారని లక్ష్మయ్య వాపోయాడు… అధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు… ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు ఇంత కరెంట్ బిల్లు రావడం ఏంటని ఆశ్చర్యాన్ని గురవుతున్నారు.