NTV Telugu Site icon

Padma Shri Awardees: ప‌ద్మశ్రీ అవార్డు గ్రహీత‌ల‌కు రూ.25 వేల పింఛన్.. జీవో జారీ

Padma Sree Awards

Padma Sree Awards

ప‌ద్మశ్రీ అవార్డు గ్రహీత‌ల‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రూ. 25 వేల పింఛన్ అందించనుంది. అందుకు సంబంధించి సర్కార్ జీవో జారీ చేసింది. కనుమరుగు అవుతున్న కళలు గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే క‌ళాకారుల‌ను ప్రోత్సహించేందుకు సీఎం రేంవ‌త్ రెడ్డి సార‌ధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు.

Read Also: Kuwait couple: వామ్మో.. ఇదేం మ్యారేజ్.. పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు తీసుకున్న జంట

ఇటీవ‌లే ప‌ద్మశ్రీ పుర‌స్కారాన్ని అందుకున్న గ‌డ్డం స‌మ్మయ్య, దాస‌రి కొండ‌ప్పకు ప్రతీ నెల రూ. 25 వేల ప్రత్యేక‌ పింఛ‌న్ మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. అంతేకాకుండా.. పద్మ విభూష‌న్, ప‌ద్మశ్రీ పుర‌స్కార విజేత‌ల‌కు స‌న్మాన కార్యక్రమంలో ప‌ద్మశ్రీ గ్రహీత‌ల‌కు రూ. 25 వేల పెన్షన్ ఇస్తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో.. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉత్తర్వులు జారీ చేశామ‌ని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. భాష‌, సాంస్కృతిక శాఖ ద్వారా వీరికి పింఛ‌న్ డ‌బ్బులు నేరుగా వారి ఖ‌తాల్లో జ‌మ చేయ‌నుంది ప్రభుత్వం.

Read Also: Guest Lecturers: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్..

Show comments