Site icon NTV Telugu

Arabian Restaurant: పాతబస్తీలోని అరేబియన్ రెస్టారెంట్‌లో కుళ్లిన మాంసం

Hyderabad

Hyderabad

భాగ్యనగరం అంటూనే మనకు గుర్తకు వచ్చేది నోరూరించే బిర్యాని. బిర్యాని అంటేనే హైదరాబాద్ కు ఫేమస్. వేరే ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో బిర్యాని తింటారు. తెల్లవారు జామున కొందరు టైం ను పెట్టుకుని బిర్యాని అమ్ముతూ లాభాలు పొందుటుంటే మరొకొందరు రెస్టారెంట్ లలో బిర్యానిని అమ్ముతుంటారు. బిర్యానిని తక్కువ రేట్లకు అమ్మి కొందరు ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మరికొందరు రోడ్డు మీద సుభ్రత ఉండదని రెస్టారెంట్ లో అయితే నాణ్యతమైన భోజనం తినొచ్చంటూ ప్రచారం చేస్తు ప్రజలను రాబట్టుకుంటారు. అది నమ్మిన జనం మంచి పేరున్న రెస్టారెంట్లకు క్యూ కడుతూ బిర్యాని ఆర్డర్ చేసి లాగించేస్తుంటారు.

Read also: Uttarpradesh : ఉత్తరప్రదేశ్ లో పేలుతున్న ట్రాన్స్ ఫార్మర్లు.. రెండ్రోజుల్లో 166మంది మృతి

కానీ అది మంచిగా వాసన వస్తుంటే ఆవురావుమంటూ తినేస్తాము కానీ.. అది నిల్వ ఉంచారా? నాన్ వెజ్ మంచిదా కాదా? అనేది ఆలోచించము. అయిన బిల్లు అక్కడ కట్టేసి హమ్మయ్య భలే వుంది బిర్యాని అని రేటింగ్ ఇచ్చి వచ్చేస్తాము. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కథ. కడుపులో మంట, వాంతులు, మోసన్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటని తెర తీస్తే.. ఫుడ్ పాయిజనింగ్. అందుకే రెస్టారెంట్ కు వెళ్లేముందు ఒక్కసారి ఆలోచించి వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే నగరంలో వారంరోజులుగా రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించగా ఫ్రిజ్ లలో కుళ్లిపోయిన మాంసం. వాటికి రంగులు పూసి నూనెలో వేయించి తరువాత అదే కస్టమర్లకు ఇస్తున్నారని అందుకే బాధితులు ఆసుపత్రి పాలు అవుతుందని గుర్తించారు. ఇలాంటి ఘటనే పాతబస్తీ ఆరేబియన్ రెస్టారెంట్ లో జరిగింది.

Read also: Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు..

పాతబస్తీలోని అరేబియన్ రెస్టారెంట్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్విహించారు. ఫ్రిజ్‌లో కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. ఫ్రిజ్‌లో పాడైపోయిన వండిన వంటకాలు గుర్తించారు. అనంతరం పాతబస్తీలోని షాదాబ్ హోటల్‌లో అధికారుల తనిఖీలు చేపట్టారు. పాడైపోయిన అల్లం వెల్లుల్లి, జీరా, డ్రై ఫ్రూట్స్‌ గుర్తించారు. కాటేదాన్‌లోని మూడు ఆయిల్ కంపెనీల్లో సోదాలు చేపట్టారు.భాగ్యనగర్ ఆయిల్, కేడియా ఆగ్రో, అంబికా ఆయిల్‌ కంపెనీల్లో సోదాలు చేశారు. వంట నూనె తయారీలో నిబంధనలు పాటించని కంపెనీలను గుర్తించారు. నిల్వ ఉంచిన రా మెటీరియల్‌లో పురుగులను చూసిన అధికారులు షాక్ తిన్నారు. ఇలాంటి రెస్టారెంట్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిల్వు ఉంచి నాన్ వెజ్ తో కస్టమర్లకు ప్రాణాపాయం ఉందని తెలిపారు. బయట ఫుడ్ తినడం మానేయాలని తెలిపారు. ప్రజలు రెస్టారెంట్లకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ACP Umamaheshwar Rao: నేటితో ముగియనున్నఉమామహేశ్వర్ రావు ఏసీబీ కస్టడీ..

Exit mobile version