Site icon NTV Telugu

శంషాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా జబర్ధస్త్ నటుడు

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్ధస్త్ షో ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్‌లలో రాకింగ్ రాకేష్ ఒకడు. ఇతర కమెడియన్‌ల స్కిట్లకు భిన్నంగా రాకింగ్ రాకేష్ స్కిట్లు ఉంటాయి. అందుకే ప్రేక్షకులను అతడి స్కిట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా కెరీర్ సాగిస్తున్న రాకింగ్ రాకేష్ తాజాగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు.

Read Also: బిగ్‌బాస్‌-5లో టాప్-5 కంటెస్టెంట్లు వీళ్లే.. టైటిల్ విజేత అతడేనా?

వివరాల్లోకి వెళ్తే… ఆదివారం నాడు శంషాబాద్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్-2022 కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా జబర్ధస్త్ నటుడు రాకింగ్ రాకేష్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్‌గా అధికారులు రాకింగ్ రాకేష్‌ను ఎంపిక చేశారు. అనంతరం ఎలైట్ హోటల్‌లో మున్సిపల్ సిబ్బంది, అంగన్​వాడీ టీచర్లకు అవేర్​నెస్​కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ సహా పలువురు కౌన్సిలర్లు హాజరై రాకింగ్ రాకేష్‌ను అభినందించారు.

Exit mobile version