Rohit Reddy for ED investigation today: వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో నేడు ఈడీ విచారణకి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయంకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలతో హాజరుకానున్నారు. 2015 ఏప్రిల్ నుండి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందించాలని ఈడీ కోరింది. ఆధార్ కార్డు నుండి పాస్ పోర్టు వరకు 10 అంశాల బయోడేటా వివరాలతో విచారణకు రావాలని ఆదేశించింది ఈడీ. పైలెట్ రోహిత్ రెడ్డి విద్యార్హతలు, కేసుల వివరాలను ఈడి ఇచ్చిన ఫార్మాట్లో సమర్పించాలని ఆదేశం జారీచేసింది. ఎన్నికల అఫిడవిట్ లో విద్యార్హతలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. విద్యార్హతలు పత్రాలతో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులో పేర్కొంది. విచారానికి వచ్చే సమయంలో పాస్పోర్ట్ తో సహా విచారణ హాజరు కావాలని ఈడీ కోరింది. విదేశీ పర్యటనలపై ఈడీ ఇచ్చిన ఫార్మెట్లో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.
Read also: Astrology : డిసెంబర్ 19, సోమవారం దినఫలాలు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈనెల 16న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో BRS- BJP మధ్య రాజకీయం మరింత హీటెక్కింది. వ్యాపార, బ్యాంకు లావాదేవీల సమాచారంతో రావాలని కోరింది ఈడీ. అయితే ఏ కేసులో ఈ సమన్లు జారీ చేశారన్నది స్పష్టత లేదంటున్నారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. పైగా ఈడీ నోటీసుల వెనుక మతలబేంటి అని లెక్కలు వేసుకుంటున్నారట. ఈడీ నోటీసులు.. ఈడీ ఎదుట హాజరు కావడం ఎలా ఉన్నా.. ఇది రాజకీయ వైరంలో భాగంగా జరిగిందా? లేక పార్టీలో తనకు ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ల పాత్ర ఏదైనా ఉందా అని ఆరా తీస్తున్నారట రోహిత్‌రెడ్డి. దీంతో తాండూరు గులాబీ రాజకీయాలపై ఫోకస్ మళ్లుతోంది. అక్కడ రోహిత్‌రెడ్డికి ఎవరితో వైరం ఉంది? రోహిత్‌రెడ్డిని ఇరికించడం వల్ల వారికి కలిగే పొలిటికల్ లబ్ధి ఏంటి? అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయట.
Read also: Tom Cruise: సినిమా చూడమని చెప్పడానికి విమానం నుంచి దూకేసాడు…
అయితే.. ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ. వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారించనున్నట్లు తెలుస్తోంది. 2015 నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలు, కంపెనీల వ్యవహారాలపై ఈడీ రోహిత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ నా బయోడేటా అడగడం హాస్యాస్పదమన్నారు. బండి సంజయ్ చెప్పిన రెండు రోజలకే ఈడీ సమన్లు వచ్చాయని, బండి సంజయ్‌కి భవిష్యవాణి తెలుసా.. నాకు నోటీసులు వచ్చే విషయం బండి సంజయ్‌కి ఎలా తెలుసు అని ఆయన ప్రశ్నించారు.
APSRTC Discount: సంక్రాంతి వేళ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్.. టికెట్లపై 10 శాతం డిస్కౌంట్