Site icon NTV Telugu

MLA Rohit Reddy: ఈడీ విచారణకు గైర్హాజరు.. వివరణ ఇచ్చిన రోహిత్ రెడ్డి

Mla Rohith Reddy

Mla Rohith Reddy

MLA Rohit Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. నేడు విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గతం లోనే ఈడీ నోటీస్ లు ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇవాళ రోహిత్‌ రెడ్డి ఈడీ విచారణకు వెళతారా అనే ఉత్కంఠం రేపుతున్న నేపథ్యంలో రోహిత్‌ రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరు పై సర్వత్రా చర్చకు దారితీసింది. ఈడీ విచారణకు గైర్హాజరుపై రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. నిన్న హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. రేపు పిటిషన్ బెంచ్ మీదకు వస్తుందని తెలిపారు. ఈరోజు ఈడి విచారణకు వెళ్ళాలా వద్దా అనేది మా న్యాయవాదులతో చర్చిస్తానని అన్నారు. మా న్యాయవాదులు ఎలా చెప్తే అలా చేస్తానని రోహిత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈడికి నేరుగా హాజరుకావాలన్న అటెండ్ అవుతాను.. లేదా ఎవరినైన పంపి లేఖ ఇవ్వామన్న ఇస్తానని పైలట్‌ రోహిత్‌ రెడ్డి తెలపడంతో సర్వత్రా ఉత్కంఠంగా మారింది.

Read also: Revenue Intelligence: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. నేడు విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గతం లోనే ఈడీ నోటీస్ లు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈడీ విచారణను నిలిపివేయాలంటూ.. హైకోర్టులో‌ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. రోహిత్ రెడ్డి పిటిషన్ బుధవారం (రేపు 28న) హైకోర్ట్ లో విచారణకు రానుంది. ఇప్పటికే రెండు రోజులు రోహిత్ రెడ్డి ని విచారించిన ఈడీ, నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో…నేడు మరో మారు రోహిత్ రెడ్డి నీ విచారించేందుకు సిద్దమైంది. హైకోర్ట్ నుండి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఈడీ అధికారులు రోహిత్ రెడ్డి విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో రోహిత్‌రెడ్డిని మళ్లీ ఈడీ ప్రశ్నించనుంది. పైలట్‌ రోహిత్ రెడ్డి హాజరుపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈడీ ముందు రోహిత్ రెడ్డి గైర్హాజరుపై ఉత్కంఠంగా మారింది.
Namaz Controversy: క్యాంపస్‌లో నమాజ్ చదివిన విద్యార్థులు.. రాజుకున్న వివాదం

Exit mobile version