RIMS Doctors: స్టైఫండ్ మరిచారు.. ఏడునెలలైనా పట్టించుకోరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ డాక్టర్లతో సేవ చేయించుకున్నారు. స్టైఫండ్ మాత్రం ఇవ్వలేదు. అడిగిన ప్రతిసారి రేపు, ఎల్లుండి అని దాట వేశారు. ఇప్పుడు వాళ్ల ఇంటర్నషిప్ కూడా పూర్తయిపోయింది. మరి మా స్టైఫండ్ సంగతి ఏమిటని ప్రశ్నిస్తే… ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు అధికారులు. ఇంతకీ ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతోంది..? తెలంగాణలో ఎక్కడా లేని పరిస్థితి ఇక్కడే ఎందుకు ఎదురవుతోంది..?
ఆదిలాబాద్ రిమ్స్‌లో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. ఇంత కాలం ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసిన అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. తమకు ఏడు నెలలుగా స్టైఫండ్ ఇవ్వడం లేదని, ఇప్పుడు ఇంటర్నెషిప్ కూడా పూర్తయిపోయిందని… ఇప్పటికైనా తమకు రావల్సిన డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు జూనియర్ డాక్టర్లు.తమతో పని చేయించుకుని… స్టై ఫండ్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు జూనియర్ డాక్టర్లు. తెలంగాణలోని అన్ని వైద్య కళాశాలల్లో స్టైఫండ్ ఇచ్చినా… కేవలం ఆదిలాబాద్ రిమ్స్ కే ఈపరిస్థితి ఎందుకొచ్చిందంటే… అధికారుల నుంచి సమాధానం లేదు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్‌ను కలిసినా… తమకు సరైన సమాధానం రాలేదంటున్నారు జూనియర్ డాక్టర్లు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ఇన్నాళ్లు తమతో సేవ చేయించుకుని… ఇప్పుడు స్టైఫండ్ ఇవ్వలేమని యాజమాన్యం మొండికేస్తోందని వాపోతున్నారు జూనియర్ డాక్టర్లు. దీంతో తగిన డబ్బుల్లేక ఉన్నత విద్యకు సైతం తాము దూరమౌతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడి సహా వివిధ రూపాల్లో నిరసన తెలుపడం మినహా తమకు మరో గత్యంతరం లేదంటున్నారు. ఇక ఆదిలాబాద్ రిమ్స్‌లో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ అంశంపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Balmoori Venkat: బాసర ట్రిపుల్ ఐటీకి శాశ్వత వీసీని నియమించాలి
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!