NTV Telugu Site icon

RIMS Doctors: స్టైఫండ్ మరిచారు.. ఏడునెలలైనా పట్టించుకోరా?

Rimadb

Rimadb

జూనియర్‌ డాక్టర్లతో సేవ చేయించుకున్నారు. స్టైఫండ్‌ మాత్రం ఇవ్వలేదు. అడిగిన ప్రతిసారి రేపు, ఎల్లుండి అని దాట వేశారు. ఇప్పుడు వాళ్ల ఇంటర్నషిప్‌ కూడా పూర్తయిపోయింది. మరి మా స్టైఫండ్‌ సంగతి ఏమిటని ప్రశ్నిస్తే… ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు అధికారులు. ఇంతకీ ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఏం జరుగుతోంది..? తెలంగాణలో ఎక్కడా లేని పరిస్థితి ఇక్కడే ఎందుకు ఎదురవుతోంది..?

ఆదిలాబాద్ రిమ్స్‌లో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. ఇంత కాలం ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసిన అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. తమకు ఏడు నెలలుగా స్టైఫండ్ ఇవ్వడం లేదని, ఇప్పుడు ఇంటర్నెషిప్‌ కూడా పూర్తయిపోయిందని… ఇప్పటికైనా తమకు రావల్సిన డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు జూనియర్‌ డాక్టర్లు.తమతో పని చేయించుకుని… స్టై ఫండ్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు జూనియర్ డాక్టర్లు. తెలంగాణలోని అన్ని వైద్య కళాశాలల్లో స్టైఫండ్ ఇచ్చినా… కేవలం ఆదిలాబాద్ రిమ్స్ కే ఈపరిస్థితి ఎందుకొచ్చిందంటే… అధికారుల నుంచి సమాధానం లేదు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్‌ను కలిసినా… తమకు సరైన సమాధానం రాలేదంటున్నారు జూనియర్ డాక్టర్లు.

ఇన్నాళ్లు తమతో సేవ చేయించుకుని… ఇప్పుడు స్టైఫండ్‌ ఇవ్వలేమని యాజమాన్యం మొండికేస్తోందని వాపోతున్నారు జూనియర్‌ డాక్టర్లు. దీంతో తగిన డబ్బుల్లేక ఉన్నత విద్యకు సైతం తాము దూరమౌతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌ ముట్టడి సహా వివిధ రూపాల్లో నిరసన తెలుపడం మినహా తమకు మరో గత్యంతరం లేదంటున్నారు. ఇక ఆదిలాబాద్‌ రిమ్స్‌లో జూనియర్‌ డాక్టర్ల స్టైఫండ్‌ అంశంపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Balmoori Venkat: బాసర ట్రిపుల్‌ ఐటీకి శాశ్వత వీసీని నియమించాలి