బీసీ కులాల జన గణన సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీలను మోడీ సర్కార్ మోసం చేయాలని చూస్తోందన్నారు. దేశజనాభాలో బీసీలే అధికమైనప్పుడు వారి జనగణన ఎందుకు చేయరంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: గంటలో పెళ్లి.. కట్న కానుకలతో వరుడు పరార్
ఈ సందర్భంగా దీనిపై ట్వీట్ చేస్తూ… దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ కులాల జన గణన చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కారు తిరస్కరించడం అంటే ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే. బీసీల పై బీజేపీ ప్రేమ కొంగజపం – దొంగజపం అని దీనినిబట్టి అర్థమవుతోంది. బీసీల మనోభావాలను గౌరవించని బీజేపీ మూల్యం చెల్లించకతప్పదు. అని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
