I DONT WANT BRIBE: ప్రభుత్వ కార్యాలయాల్లో, అందునా రెవెన్యూశాఖలో అధికారులు అమ్యామ్యాలు ఎక్కువగా గుంజుతారనేది జనం ఆరోపణ ఎదుర్కింటుంటారు. ఇక ప్రభుత్వ కార్యాలయం పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది లంచమే.. గవర్నమెంట్ ఆఫీసుల్లో అమ్యామ్యాలు సమర్పించుకుంటేనే ఏదైనా పని జరుగుతుందనే టాక్ ఉంది. దీంతో.. అధికారులకు కరెన్సీ ఇవ్వనిదే ఫైల్ కదలదని అంటారు. దీంతో.. అవినీతిని అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా అధికారుల తీరు మాత్రం మారడం లేదు, ఏసీబీ, విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ టీమ్ లు ఉన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి దందా మాత్రం పోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతూనే వున్నాయి.. ఇక పనుల కోసం వెళ్లేవారు కూడా ముందే ఎంతో కొంత ముట్టచెప్పాలని డిసైడ్ అయ్యే వస్తున్నారంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో ఊహించుకోవచ్చు మనం..
Read also: Canada: కెనడాలోని ఓ ఆలయ గోడలపై ఇండియా వ్యతిరేక నినాదాలు.. ఖండించిన హైకమిషన్
అయితే ఉద్యోగులకు లంచాల ముద్ర పడినా అందరూ అలా ఉంటారని లేదు. కొందరు పారదర్శకంగా పని చేసే ఉద్యోగులు కూడా ఉంటారు. ఇక రెవిన్యూ శాఖలో లంచాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిందంటారు. ఇందుకు భిన్నంగా ‘నాకు లంచం ఇవ్వొద్దు’ అంటూ జేబుకు బ్యాడ్జి తగిలించుకుని బుధవారం విధులకు హాజరయ్యారు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఎం.ఆర్.ఐ.) చిలకరాజు నర్సయ్య. దీంతో.. ప్రభుత్వ అధికారులు లంచాలకు అలవాటు పడ్డారనే అపవాదు ఉందని.. తాను అలాంటివాడిని కాదని చెప్పేందుకే ఇలా బ్యాడ్జి ధరించినట్లు నర్సయ్య వివరించారు. ఆయన బ్యాడ్జీ ధరించి విధులకు రావడంతో.. ఇది తోటి ఉద్యోగులకు సవాల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి, నర్సయ్యను చూసి తోటి ఉద్యోగులు నేర్చుకోవాలన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక అందరూ ఇలా ఉంటే.. లంచం మాట విననపడదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
CM Jagan Strong Counter to TDP Atchannaidu : ఏ అంశం పై అయినా చర్చకు రెడీ
