NTV Telugu Site icon

కరోనా వేళ.. గొప్ప మనసు చాటుకున్న రేవంత్ రెడ్డి

revanth reddy

గాంధీ ఆసుపత్రి ముందు కరోనా బాధితులకు ఉచిత భోజన సౌకర్యం ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. ప్రతీ రోజు వెయ్యి మందికి భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు… ఈ కార్యక్రమం ప్రారంభం అయిందని..లాక్ డౌన్ కారణంగా పేషంట్స్ కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ వర్క్ చేస్తుంటే అరెస్ట్ లు చేస్తున్నారు..విచారణ పేరిట అడ్డుకుం టున్నారని కెసిఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. గాంధీ ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ అయినా… కనీస సౌకర్యాలు లేవు ఎవరి దగ్గర డబ్బులు లేవన్నారు. డాక్టర్, నర్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆహారం ఏర్పాటు చేయలేదని.. ప్రతి రోజు 1000 మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాక్ డౌన్ ఉన్నంత వరకు భోజన వసతి కల్పిస్తాం..5 రూపాయలకే భోజనమని పేర్కొన్నారు. బెడ్స్ కొరత, ఆక్సిజన్ , రెమెడిషివర్ కొరత తీవ్రంగా ఉందని.. సిగ్గు లేకుండా వసూళ్ల కోసం .. ప్రగతి భవన్ లో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం అయ్యిందని ఫైర్ అయ్యారు.