CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో తన బ్రాండ్ పాలనను కొనసాగిస్తున్నారు. ఒకవైపు తనదైన శైలిలో పాలన కొనసాగిస్తూనే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని తొలగించేందుకు అన్ని రకాల కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన ప్రతిదానిపైనా దృష్టి సారిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేశారు. కాగా, తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.
Read also: TSPSC Group 1: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?
ఈ క్రమంలో ధరణిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పుడు ధరణి పోర్టల్‌ను క్లీన్ చేసే దిశగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇతర వ్యక్తుల పేర్లతో నమోదైన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేతపత్రం ఉంటుందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
Read also: Rajya Sabha Elections: నేడే రాజ్యసభ ఎన్నికల పోలింగ్.. ఏకగ్రీవమైన సభ్యులు వీరే..!
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భూకబ్జాలకు పాల్పడి ఆరోపణలు ఎదుర్కొన్న గులాబీ నేతలే ఈ శ్వేతపత్రం టార్గెట్ కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలో.. ధరణి పోర్టల్ పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
Read also: BJP High Command: రాష్ట్రానికి మోడీ, అమిత్ షా, నడ్డా.. ఈనెల 29న తొలి జాబితా?
ఈ క్రమంలోనే.. ధరణి సమస్యల పరిష్కారానికి మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభమైన ధరణి పోర్టల్ సమస్యలకు నిలయంగా మారిందని, ఈ పోర్టల్‌ను గులాబీ నేతలు అడ్డం పెట్టుకుని కొనసాగిస్తున్నారని రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలంతా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. భూకబ్జాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పోర్టల్ వల్ల రైతుల భూములన్నీ వివాదాల్లో చిక్కుకున్నాయని.. చాలా చోట్ల అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ పోర్టల్‌ను ఎత్తివేస్తామని ప్రకటించారు.
Astrology: ఫిబ్రవరి 27, మంగళవారం దినఫలాలు