Revanth Reddy: తెలంగాణలో బీజేపీని నడిపిస్తుంది బీఆర్ఎస్ అని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటునే అపహాస్యం చేసిన మోడీ.. తన మిత్రుడు కేసీఆర్ తో జరిగిన చర్చలు బయట పెట్టారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ను అరెస్ట్ చేయొద్దు అని కూడా చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు. కిషన్ రెడ్డి నియామకం కూడా కేసీఆర్ కోరిక మేరకు అనేది చెప్తే కూడా బాగుండేదని అన్నారు. తెలంగాణ లో బీజేపీని నదిపిస్తుంది బీఆర్ఎస్ అన్నారు. అన్ని కోరికలు నెరవేర్చలేదు కొన్ని కోరికలు నెరవేర్చినట్టు మోడీ చెప్పారని, అవినీతి పరుల భరతం పడతా అనే మోడీ..కేసీఆర్ మీద ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. అవినీతి చేశారు అని చెప్పిన మోడీ.. కేసీఆర్ మీద విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని అన్నారు. బీజేపీకి… కేసీఆర్ ప్రొటెక్షన్ మని అందిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మోడీ భాగస్వామిగా ఉన్న కేసీఆర్ కి ఇంకా మద్దతు కొనసాగిస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో పొత్తు నుండి వైదొలుగుతుందా లేదా? ఎంఐఎం సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు.
తెలంగాణలో మైనార్టీలు ఆలోచన చేయాలన్నారు. బీజేపీ..బీఆర్ఎస్ అవిభక్త కవలలని అన్నారు. ఒకే నాణెంకి ఉన్న బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు అన్నారు. ఎంఐఎం, బీజేపీ మిత్రుడు కేసీఆర్ తో ఉంటారా? కాంగ్రెస్ తో ఉంటారో తేల్చుకొండి అని అన్నారు. కేసీఆర్ అవినీతి పై మోడీ..అమిత్ షా లు మాట్లాడవుతున్నారని అన్నారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవడానికి అడ్డుకుంటుంది ఎవరు..? అని ప్రశ్నించారు. ధరణి, ఓఆర్ఆర్ ప్రభుత్వ అమ్మకాలపై నేను ఫిర్యాదు చేశా అని అన్నారు. విచారణకు అదేశించండి అని కోరారు. కేసీఆర్ బాస్ మోడీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అధిష్టానం మోడీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కొడుకును సీఎం చేయాలని మోడీని వేడుకున్నాడు అంటే… కేసీఆర్ అధిష్టానం మోడీ అనే కదా? అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని ఓ బీఆర్ఎస్ ఎంపీ చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 7 సీట్లు బీజేపీకి ఇవ్వాలని నిర్ణయం జరిగిందన్నారు. కర్ణాటకలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి నిధులు ఇచ్చింది అంటున్నాడు మోడీ.. సీబీఐ విచారణకు అదేశించాలని కోరారు. ఎవరు ఆపారు నిన్ను విచారణ వద్దని అని ప్రశ్నించారు.
Rajinikanth: సూపర్ స్టార్ లుక్ మార్చాడు… జైలర్ కన్నా స్టైలిష్ గా ఉన్నాడు