Site icon NTV Telugu

CM Revanth Reddy : ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశం దుమారం రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, మొత్తం బకాయిల్లో కనీసం 50 శాతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్‌ కాలేజ్‌ యాజమాన్యాలు మరోసారి సమ్మెకు దిగాయి. అయితే.. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.

CM Revanth Reddy : బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్.. ఇద్దరు కలిసి..

“సహకరించాల్సిన వారు బంద్ పెడుతున్నారు. బంద్ పెట్టారు కదా, ఫీజులు అడగరా..? మేము వచ్చిన తర్వాత బకాయి పెరిగినా వాటిని విడతల వారీగా చెల్లిస్తాం. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు” అని ఆయన హెచ్చరించారు. ఇద్దరు కాలేజీ పెద్దలు పైరవీకి వచ్చారని కానీ ప్రభుత్వం ఒత్తిడికి లోనుకావడం లేదని చెప్పారు. “విద్య సేవ.. వ్యాపారం కాదు. విద్యార్థులను వెనక్కి తిప్పడం ఎట్లనో నాకు తెలుసు. ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఇప్పటివరకు ఆపని చేయలేదు. కానీ అవసరమైతే చూడాలి” అని రేవంత్‌ హెచ్చరించారు.

ప్రైవేట్‌ కాలేజీల రాజకీయ అనుబంధాలపై కూడా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. “మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో నాకు తెలియదా? మాట్లాడుతున్న ముగ్గురి సంగతి కూడా నాకు తెలుసు. వచ్చే ఏడాది నుండి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం” అని అన్నారు. అధికారులపై కాలేజ్‌ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. “అధికారులను తిడతారట..! ఎట్లా తిడతారు? ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. విద్యార్ధుల భవిష్యత్తు పణంగా పెట్టొద్దు. విద్యార్ధులపై బరువుగా మారే విధంగా డొనేషన్లు, ఫీజులు పెంచితే సహించం” అని స్పష్టం చేశారు. అరోరా కాలేజీ రమేష్ కి ఎన్ని అనుమతి ఇవ్వాలి మహబూబ్ నగర్ లో క్యాంప్ ఉంటది..హైదరాబాద్ లో అనుమతి ఇవ్వాలి అంట అని సీఎం రేవంత్ మండిపడ్డారు.

CM Revanth Reddy : ORRను పల్లిబఠానీల లెక్క అమ్మేశారు కేసీఆర్

Exit mobile version