Revanth Reddy: నేడు మూడు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: నేడు మూడు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బోథ్, నిర్మల్, జనగాం నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మూడు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు బోథ్ బహిరంగసభ రేవంత్ మాట్లాడి.. అనంతరం మధ్యాహ్నం 1గంటలకు నిర్మల్ సభ లో పాల్గొని మాట్లాడనున్నారు. ఆ తరువాత సాయంత్రం 4గంటలకు జనగాంలో బహిరంగసభల్లో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
కామారెడ్డిలోని రెడ్డిపేటలో నిన్న రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటరన్న మేలుకో.. నిరుద్యోగిని కాపాడుకో అంటూ నిరుద్యోగులు బ్యానర్లు పట్టుకుని తిరుగుతున్నారన్నారు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని నిరుద్యోగులు భావించారని, కానీ పదేళ్లలో కేసీఆర్ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు రేవంత్ రెడ్డి. పరీక్ష పత్రాలు లీక్ అయి జిరాక్స్ సెంటర్ లలో అమ్ముకుంటుంటే.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్య చేసుకున్న ఏ కుటుంబాన్నైనా కేసీఆర్ గానీ, ఎమ్మెల్యేలు గానీ పరామర్శించారా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో ట్యాంక్ బ్యాండ్ పై రైతు ఉరి వేసుకుని చనిపోతే పరామర్శించిన నాధుడు లేడు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పేరుతో మీ భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు.. రైతులు అడ్డుకుంటే పోలీసులతో కొట్టించిండ్రు తప్ప బీఆరెస్ నేతలు అండగా నిలవలేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చి తమ పూర్వీకుల ఊరు అని చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు.
Also Read
ఊరిమీద పడి రక్తం తాగే పులిని చంపడానికి వేటగాడిని తీసుకొచ్చినట్లు… కామారెడ్డిపై పడి మీ భూములు కాజేయాలని చూస్తున్న కేసీఆర్ ను వేటాడటానికి నన్ను అధిష్టానం ఇక్కడికి పంపింది. పేదల రక్తం రుచి మరిగిన కేసీఆర్ ను కామారెడ్డి పొలిమేరలకు తరమడానికే నేను ఇక్కడ పోటీ చేస్తున్నా. కామారెడ్డిలో మీ భూములను కాపాడే బాధ్యత నాది. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం కేసీఆర్ వస్తే మీ భూములు పోతాయ్.. మీ పిల్లలకు ఉద్యోగాలు రావు.. అడవిపందుల నుంచి పంటను కాపాడుకున్నట్లు… మీ ఓట్ల కంచెతో కామారెడ్డిని కాపాడుకునే బాధ్యత మీది. మీరు అండగా ఉంటే కేసీఆర్ తాత వచ్చినా కామారెడ్డిలో కాలు పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Astrology: నవంబర్ 15, బుధవారం దినఫలాలు
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
-
Saayoni Ghosh: పార్లమెంట్‌ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
-
The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!