NTV Telugu Site icon

Revanth Reddy: మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి పర్యటన.. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేటలో ప్రచారం

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: మహబూబ్ నగర్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేటలో ఎన్నికల ప్రచారం పాల్గొననున్నారు. నేడు మూడు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు వనపర్తి లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభ లో ప్రసంగించి అనంతరం మధ్యాహ్నాం 2 గంటలకు నాగర్ కర్నూల్ చేరుకుంటారు. అనంతరం అక్కడి ఏర్పాటు చేసిని సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు అచ్చంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.

Read also: Singer Damini : రతికా- రాహుల్ సిప్లిగంజ్ లవ్ స్టోరి గురించి నిజాలు బయటపెట్టిన దామిని.. అదంతా అబద్దామా?

ఖైరతాబాద్ లో నిన్న రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే.. ఖైరతాబాద్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరని.. ఒకరు ఖైరతబాద్ గణేశుడు, ఇంకొకరు పీ.జనార్దన్ రెడ్డి అని అన్నారు. పీజేఆర్ మన మధ్య లేకపోయినా పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. 20ఏళ్ల తరువాత పేజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశం ఖైరతాబాద్ ప్రజలకు వచ్చిందన్నారు. విజయమ్మకు ఓటు వేస్తే రేవంత్ రెడ్డికి ఓటు వేసినట్టేనని, పీజేఆర్ హయాంలోనే మీకు ఇండ్లు వచ్చినయ్, కరెంటు వచ్చింది.. అభివృద్ధి జరిగిందన్నారు రేవంత్‌ రెడ్డి. దానం నాగేందర్ సగం హైదరాబాద్ ను ఆక్రమించుకున్నాడు కానీ.. బస్తీల్లో పేదలకు చేసిందేం లేదన్నారు. బీజేపీ చింతల రాంచంద్రా రెడ్డి మీకు కొత్త కాదు.. పాత చింతకాయ పచ్చడేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పీజేఆర్ బిడ్డ విజయమ్మకు ఒక్క అవకాశం ఇవ్వండి.. ఈ ఆడబిడ్డను గెలిపిస్తే మీ ఇంట్లో మీ ఆత్మగౌరవం నిలబడుతుంది. విజయమ్మను గెలిపిస్తే పీజేఆర్ పేరు నిలబెడుతుంది.. మీ కోసం కొట్లాడుతుంది. పంజాగుట్ట చౌరస్తాలో దివాన్ జీ దగ్గర బీడీలు అమ్ముకునే దానంను ఎమ్మెల్యేను, మంత్రిని చేసింది కాంగ్రెస్. అలాంటి నువ్వు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తావా? అన్నం పెట్టిన కాంగ్రెస్ కు సున్నం పెట్టడం న్యాయమేనా నాగేందర్.. ఇలాంటి దానంను ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
Salaar: రికార్డ్స్ లో కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది…

Show comments