NTV Telugu Site icon

Revanth Reddy: నేడు కరీంనగర్, సిద్దిపేటలో రేవంత్‌ పర్యటన..

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: నేడు ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మానకొండూర్, మహేశ్వరం, ఎల్బీ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సభల్లో రేవంత్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు దుబ్బాక, మ. 12.30కి హుజూరాబాద్, 2 గంటలకు మానకొండూర్ బహిరంగ సభల్లో, 3 గంటలకు మహేశ్వరం, 4 గంటలకు ఎల్బీ నగర్, 5 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా దుబ్బాకలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లా మానకొండుర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్ననున్నారు. రేణికుంట టోల్ గేట్ ప్రక్కన భారీ బహిరంగ సభకు పూర్తీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్‌ శ్రేణులు. కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నిన్న పర్యటించారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే… మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచాడని ఆరోపించారు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండని విమర్శించారు. ముంపు బాధితుల పక్షాన ఆనాడు ఏటిగడ్డ కిష్టాపూర్ లో తాను దీక్ష చేశానని తెలిపారు. కేసీఆర్ ను మీరు పాతాళానికి తొక్కాలనుకుంటే.. కామారెడ్డికి పారిపోయిండని రేవంత్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డికే కాదు.. కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు కేసీఆర్ ను ఓడించి తీరతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుండే.. ఇయ్యాల ఎర్రవల్లిలో ఎట్లుండు అని ప్రశ్నించారు. రైతుల మేలుకంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకుపోయేందుకే ప్రాధాన్యతనిచ్చిండని తెలిపారు. రైతుల వడ్లు కొనని కేసీఆర్… ఆయన ఫామ్ హౌస్ లో పండిన వడ్లను కావేరి సీడ్స్ కు క్వింటా రూ.4500లకు అమ్ముకుండని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించాలి.. పొలిమేరలకు తరమాలని ఈ సందర్భంగా అక్కడి జనాలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకొనివ్వం.. ముమ్మాటికీ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బక్కోడు కాదు… లక్షకోట్లు మింగి, పదివేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు అని విమర్శించారు. తాను ఇక్కడికి వస్తున్నానని కేసీఆర్ కొడంగల్ పోయిండని అన్నారు. నా నోరు తెరిస్తే కంపు అని కొడంగల్ లో కేసీఆర్ అంటుండు.. ఇద్దరం పోదాం… డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకుందామని తెలిపారు. ఎవరి నోట్లో కంపు ఉందో తేలుద్దాం… పొద్దున లేస్తే ఎత్తుడు పోసుడే నీ పని.. నీతో నాకు పోలికా? అని కేసీఆర్ పై మండిపడ్డారు.
Odisha: ఒడిశాలో దారుణం.. సిట్ అప్‎లు చేయించిన టీచర్.. చనిపోయిన చిన్నారి