Site icon NTV Telugu

CM Revanth Reddy : ORRను పల్లిబఠానీల లెక్క అమ్మేశారు కేసీఆర్

Cm Revanth

Cm Revanth

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. విజ్ఞతతో ఆలోచించి.. అభివృద్ధి పథం వైపు నడిపేందుకు ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఓటర్లకు సూచన చేయాలని అనుకున్న. హైదరాబాద్ ఎప్పుడు అభివృద్ధి చెందింది అని ఆలోచన చేయండి అని ఆయన వ్యాఖ్యానించారు. 69 వేల కోట్ల అప్పు.. 16 వేల కోట్ల మిగిలి బడ్జెట్‌తో మేము కేసీఆర్‌కి తెలంగామ అప్పగించడం జరిగిందన్నారు.

కేసీఆర్ ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పుతో మాకు ఇచ్చాడని సీఎం రేవంత్‌ అన్నారు. నగరంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ లు కట్టింది కాంగ్రెస్ హయాంలోనే అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. మహానగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ కాదా అని ఆయన ఉద్ఘాటించారు. హైటెక్ సిటీ.. మెట్రో.. ఔటర్ రింగ్ రోడ్డు.. గోదావరి వాటర్..ISB.. నల్సార్ యూనివర్సిటీ లు తెచ్చింది కాంగ్రెస్ కాదా అని ఆయన అన్నారు. నగరానికి వరదలు వస్తే కిషన్ రెడ్డి చిల్లి గవ్వ కేంద్రం నుంచి తీసుకురాలేదని విమర్శించారు.

SSMB 29 : ఫస్ట్ టైమ్ అలాంటి పని చేస్తున్న జక్కన్న.. మహేశ్ ఫ్యాన్స్ టెన్షన్

సచివాలయంలో దేవాలయం కూల్చినా కిషన్ రెడ్డి పట్టించుకోలేదని, సచివాలయం.. కాళేశ్వరం.. కమాండ్ కంట్రోల్ సెంటర్.. ప్రగతి భవన్ తప్పితే ఏం చేశాడు కేసీఆర్ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కేటీఆర్.. భవిష్యత్ రాజకీయం వాస్తు కోసం సచివాలయం కట్టారు కేసీఆర్ అని ఆయన ఎద్దేవా చేశారు. దాని వల్ల ప్రయోజనం ఏం వచ్చిందని, కేవలం.. కొడుకుని CM చేయాలని వాస్తు కోసం కూల్చేశావు అని ఆయన దుయ్యబట్టారు. పేదల కోసం అనా పైసా ఉపయోగం ఉందా..? కమాండ్ కంట్రోల్ సెంటర్ గండికోట రహస్యం.. సద్దాం హుస్సేన్ తనలాంటి వారిని ఆరుగురిని ఏర్పాటు చేసుకున్నాడు అంట.. అట్లా.. కేసీఆర్.. కేటీఆర్.. ఇతరుల కుటుంబాలలోకి తొంగి చూసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ వాడుకున్నాడు అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

మేం కట్టిన ఎయిర్ పోర్ట్ తప్పితే.. కొత్తది తెచ్చడా..? GHMC మీద 10 వేల కోట్ల అప్పు ఉంది.. కార్పొరేటర్… MLA.. MP.. MLC అంతా వాళ్ళ చేతిలోనే ఉంది, కొత్త పథకం ఏమైనా GHMC కోసం తెచ్చారా..! L and T నీ బ్లాక్ మెయిల్ చేసింది కేసీఆర్ కాదా.. వాళ్లు దివాలా తీయడానికి మీరు కారణం కాదా..? మేం కట్టిన ORRని ఏడున్నర వేల కోట్లకు అమ్మేశాడని, పల్లి బఠానీల లెక్క అమ్మేశారు కేసీఆర్ అని ఆయన సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Story Board: దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు.. నిర్లక్ష్యంతో పోతున్న నిండు ప్రాణాలు

Exit mobile version