Revanth Reddy: బండి సంజయ్ ని పదవి నుండి తప్పించిన తర్వాత బుర్ర పని చేస్తున్నట్టు లేదని టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి పరిధిలో ఉండే కమిటీనే.. తప్పు జరిగింది అని చెప్పిందన్నారు. అవినీతి ని వదలను అని చెప్పే మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? అని ప్రశ్నించారు. నివేదిక మీద చర్యలు తీసుకో అంటే.. రాష్ట్రంలో అధికారం లోకి వస్తే చర్యలు తీసుకుంటా అని చెప్పడం ఏంటి? అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాదు.. విచారణ జరపం అని చెప్పదలుచుకున్నదా బీజేపీ అని ప్రశ్నించారు. ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో కేసీఆర్ దోపిడీకి తెర లేపారన్నారు. మెడిగడ్డ ప్లానింగ్ వేరు.. డిజైన్ అనుకున్నది ఒకటి చేసింది ఒకటి అని మండిపడ్డారు. నేనే ఆలోచన చేసి.. మెదడు, రక్తం ధారపోసి కట్టిన అన్నారు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కుంగి పోగానే.. సాంకేతిక నిపుణుల మీద తోసి పనిలో పడ్డారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనాలు 38, 500 కోట్ల ను లక్ష 51 వేళా కోట్లకు పెంచిందన్నారు. పెంచుకున్న బడ్జెట్ లో అయినా నాణ్యతతో ఉంటే.. బాగుండేదని వ్యంగాస్త్రం వేశారు.
తప్పు సరిదిద్దుకోవడం మానేసి.. రాహుల్ గాందీని నన్ను తిడుతున్నారు కేటీఆర్ అని మండిపడ్డారు. రిటైర్ అయిన అధికారి మురళీధర్ రావు కు బాధ్యతలు ఇచ్చి తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడిగడ్డ మళ్ళీ కూలగొట్టి కొత్తది కట్టాలి అంటున్నారు నిపుణులు అని తెలిపారు. కూలిన దాన్ని ఎల్ అండ్ టి కడుతుంది అంటున్నారు.. ఇంకో ఆరు నెలలు అయితే కంపనీ గడువు కూడా ముగుస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. ఆరు నెలల తరవత ఏదైనా జరిగితే బాద్యులు ఎవరు? అని ప్రశ్నించారు. కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక పై సీబీఐ విచారణ కి కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదన్నారు. అవకతవకలు పై బాద్యులందరి పై కేసులు పెట్టాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కి ప్రొటెస్ట్ మని ఇస్తున్నదని ఆరోపించారు. అందుకే దీనిపై విచారణ చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ దగ్గరే .. సాగు నీటి శాఖ ఉందన్నారు. మరి ఎందుకు నోరు మెదపడం లేదు ? అని ప్రశ్నించారు. బాద్యులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నాడు? అని ప్రశ్నించారు. నీ తప్పిదం లేకుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అన్నారు. సీతారామలో 500 కోట్లకు అంచనా పెంచి కేసీఆర్ బంధువు ప్రతిమ వాళ్లకు ఇచ్చారన్నారు. అగ్రిమెంట్ సమయంలో తక్కువ ధరకు ఇచ్చి.. రేవైజ్ లో ధర పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరంలో కూడా 80 వేల కోట్లు అగ్రిమెంట్ లో పెట్టి లక్ష 50 వేళా కోట్లకు పెంచారని తెలిపారు. ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అంటూ నిప్పులు చెరిగారు. ఈ టెర్రరిస్టులను వెంటనే శిక్షించాలి కేంద్రం అని డిమాండ్ చేశారు. కేంద్రం బీఆర్ఎస్ కి సహకరించడంతోనే ప్రాజెక్టుల అవినీతి మయం అయ్యిందన్నారు. మెడిగడ్డ ఇష్యుని డైవర్ట్ చేసే పనిలో బీఆర్ఎస్ ఉందన్నారు. కేంద్రం.. ఇతర రాష్ట్రాల్లో ఉండే అధికారులతో విచారణ జరగాలని తెలిపారు. సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన విచారణ జరగాలన్నారు. 2014 నుండి మంత్రులుగా ఉన్న హరీష్.. కేసీఆర్ లను అధికారం నుండి తప్పించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఎన్నికల పర్యటనకు వస్తున్నారు కానీ.. కూలిన ప్రాజెక్టు చూడడానికి ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. మోడీ పరిశీలించి.. చర్యలకు అదేశించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల పర్యటన కాదు.. మెడిగడ్డ పర్యటన చేసి అప్పుడే ఓట్లు అడగండి అని తెలిపారు. కోదండరాం కూడా తెలంగాణ వ్యతిరేకే నా? అందుకే జనం చెప్పుతో కొట్టడానికి సిద్ధం అయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కత్తులతో పొడుస్తున్నారు.. మొదట టీడీపీ సంక నాకింది బీఆర్ఎస్ అని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు బీఆర్ఎస్ లో చేరాడన్నారు. టీడీపీ మీద దాడి చేసినప్పుడు ఒకలా.. తర్వాత ఇంకోలా మాట్లాడుతోంది బీఆర్ఎస్ అన్నారు. కే.ఏ.పాల్ కూడా పోటీ చేయడం లేదు.. పాల్ బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నట్టా? అని ప్రశ్నించారు. మాట్లాడటానికి బుద్ది ఉండాలి అంటూ మండిపడ్డారు. డిసెంబర్ 9 తర్వాత బాద్యుల తాటా తిస్తాం అన్నారు. కేటీఆర్ అనే వాణ్ణి అంత సీరియస్ గా తీసుకోవద్దన్నారు. నివేదిక రాక ముందు ఒకటి.. ఇప్పుడు ఇంకొకటి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
Salman Khan: టైగర్ తో కలిసిన పఠాన్ అండ్ కబీర్…