NTV Telugu Site icon

CM Revanth Reddy: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. విద్యుత్‌ శాఖ, తాగునీటిపై చర్చ

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ సచివాలయంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. విద్యుత్‌ శాఖ, తాగునీటిపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాగునీటి అవసరాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వేసవిలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలిస్తామన్నారు. మరోవైపు ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఎండలు ఎక్కువ కావడం నీటి కోసం తిప్పలు ప్రజలు పడుతుండటంపై చర్చలు జరుపనున్నారు. అంతే కాకుండా.. ఈ ఎండలకు పవర్ కట్ కాకుండా చూడటానికి రేవంత్ సర్కార్. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడకుండా కరెంట్, తాగునీటిపై అధికారులతో చర్చించనున్నారు.

Read also: MS Dhoni E-Cycle: కొత్త ఈ-సైకిల్​ తో హల్చల్ చేస్తున్న ధోనీ.. మరి ఆ ఈ-సైకిల్ విశేషాలేంటంటే..?!

ఇక మరోవైపు గ్రేటర్‌లో విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. రెండు రోజుల్లో 74 మిలియన్ యూనిట్లు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటే నెలాఖరు నాటికి 80 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్‌లోడ్‌ను నిరోధించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ఉన్నతాధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిమాండ్‌ ఎంత పెరిగినా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎండీ అధికారులను ఆదేశించారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడంతో ఏసీలు, కూలర్ల వినియోగం పెరుగుతోందని, విద్యుత్తు వినియోగం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా గోషామహల్‌లో 40.7 డిగ్రీలు, బేగంపేటలో 40.2 డిగ్రీలు, కార్వాన్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
CM Yogi : ఆ కారణంగా సీఎం యోగి బులంద్‌షహర్-నోయిడా పర్యటన రద్దు?